ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఉంటూ వచ్చిన యజ్వేంద్ర చాహాల్‌ను, మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే..
215
ఆర్‌ఆర్‌లోకి ఎంట్రీని స్పెషల్‌గా ప్లాన్ చేసిన రాజస్థాన్ రాయల్స్, ట్విట్టర్ అకౌంట్‌లో తన స్టైల్‌లో సందడి చేశాడు. ఎంత తిన్నా, చూడడానికి బక్కగా ఉండే ఓ ఫ్రెండ్... మనందరికీ ఉంటాడంటూ యజ్వేంద్ర చాహాల్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్...
315
దానికి ఈ అకౌంట్‌ను హ్యాక్ చేస్తానంటూ కామెంట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, ఆర్ఆర్ సహ యజమాని జాక్ లుష్ మెక్‌క్రమ్ నుంచి ట్విట్టర్ పాస్ వర్డ్ తీసుకున్నాడట...
415
ఇప్పుడు అసలైన మజా వస్తుందని కామెంట్ చేసిన చాహాల్, ‘ఆర్ఆర్ కొత్త కెప్టెన్‌ని కలవండి’ అంటూ రాయల్స్ జెర్సీలో ఉన్న యజ్వేంద్ర చాహాల్ ఫోటోను పోస్టు చేశాడు...
515
దానికి ‘కంగ్రాట్స్ చాహాల్...’ అంటూ సంజూ శాంసన్ కామెంట్ చేయగా, ‘జెలసీ ఫీల్ అవుతున్నావ్..’ అంటూ రిప్లై ఇచ్చాడు యజ్వేంద్ర చాహాల్...
615
ఆ తర్వాత 10 వేల రీట్వీట్లు చేస్తే, తాను జోస్ బట్లర్ అంకుల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని చాహాల్ సిక్సర్ కొడుతున్న ఫోటోను పోస్ట్ చేసిన రాయల్స్, తాను విసిరిన బంతికే చంద్రుడిలా భూమి చుట్టూ తిరుగుతోందంటూ ఓ ఫన్నీ వీడియో పోస్టు చేశాడు...
715
‘ఎక్కడున్నావ్... నా ప్రేమికుడా రవిచంద్రన్ అశ్విన్. ఫోనూ లేదు, మెసేజ్ లేదు... వేరేవాళ్లు నీ జీవితంలో ఉన్నారా?’ అంటూ మరో పోస్టు... రాజస్థాన్ రాయల్స్ అకౌంట్ నుంచి వచ్చింది.
815
దానికి ‘నేను నిశ్శబ్దంగా రావాలని అనుకున్నా. ఇప్పుడు ఇక్కడే ఉన్నా... ’ అంటూ రాజస్థాన్ రాయల్స్ క్యాపు పెట్టుకున్న ఫోటోతో రిప్లై ఇచ్చాడు అశ్విన్...
915
అశ్విన్‌కి ‘నువ్వు పింక్ డ్రెస్సులోనే బాగుంటావ్’ అని రిప్లై ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్... కొద్దిసేపటికే ‘హాయ్ జోష్ బేబీ... ఐ లవ్ యూ సో మచ్’ అంటూ బట్లర్‌కి మెసేజ్ చేసిన ఫోటోను పోస్టు చేశాడు...
1015
‘ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేయ్... ’ అని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగర్కర్ ఆర్డర్ వేయడంతో... ఈసారికి బతికిపోయావ్ అడ్మిన్... అంటూ లాగ్ అవుట్ అవుతున్నట్టు పోస్టు చేశాడు యజ్వేంద్ర చాహాల్...
1115
అసలే రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ వేసే ఫన్నీ ట్వీట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్ఆర్ ట్విట్టర్ ఖాతాకి, మరింత జోష్‌ని, వినోదాన్ని జోడించాడు యజ్వేంద్ర చాహాల్...
1215
కుమార సంగర్కరకి తోడు బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చేరడంతో ఈసారి ఆర్ఆర్ మరింత బలంగా కనబడుతోంది...
1315
2008 సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ఆ తర్వాత ఫైనల్ కూడా చేరలేకపోయింది. గత మూడు సీజన్లులగా ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోతోంది రాజస్థాన్ రాయల్స్...
1415
ఈ సారి వేలంలో అశ్విన్, చాహాల్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, సిమ్రాన్ హెట్మయర్, కరణ్ నాయర్, నాథన్ కౌంటర్‌నైల్, జిమ్మీ నీశమ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట బౌల్ట్ వంటి స్టార్లను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...
1515
మునుపటితో పోలిస్తే చాలా పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్ రాయల్స్, మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది...