IPL: చెన్నైకి గుడ్ న్యూస్.. ఆ ఆటగాడు ఫిట్.. సూరత్ లో క్యాంప్ కు హాజరు.. ఇక మిగిలింది రూ. 14 కోట్ల ఆల్ రౌండరే..

Published : Mar 17, 2022, 10:38 AM IST

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. గతేడాది సీఎస్కే తరఫున బరిలోకి దిగి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఓపెనర్  సూరత్ లో క్యాంపుతో చేరాడు. అయితే రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆల్ రౌండర్ మాత్రం.. 

PREV
110
IPL: చెన్నైకి గుడ్ న్యూస్.. ఆ ఆటగాడు ఫిట్.. సూరత్ లో క్యాంప్ కు హాజరు.. ఇక మిగిలింది రూ. 14 కోట్ల ఆల్ రౌండరే..

ఐపీఎల్-15 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ  ఆయా ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు.. జట్లు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులకు చేరుకుంటున్నాయి.  మిగతా జట్లన్నీ మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేస్తుంటే  నాలుగు సార్లు విజేత చెన్నై మాత్రం  కాస్త భిన్నంగా  సూరత్ లో క్యాంప్ ఏర్పాటు చేసింది. 

210

ఇప్పటికే ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా తో పాటు కీలక ఆటగాళ్లంతా సూరత్ లోని క్యాంపునకు చేరారు.  ప్రస్తుతం వీళ్లంతా  కోచ్ లు, ఇతర సిబ్బంది శిక్షణలో కఠిన సాధన చేస్తున్నారు. 

310

అయితే  ఆ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వెస్టిండీస్ తో  టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ   సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. జట్టుతో చేరాడు.  బుధవారం అతడు సూరత్ లోని  సీఎస్కే క్యాంపునకు చేరుకున్నాడు. 

410

గాయం కారణంగా అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు ఆడతాడా..? లేదా..? అనే విషయంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో గైక్వాడ్ రాక సీఎస్కే అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది. 
 

510

గతేడాది  ఫాఫ్ డుప్లెసిస్ తో కలిసి  దుమ్ము రేపాడు గైక్వాడ్.. ఇద్దరూ కలిసి పోటీ పడి పరుగులు సాధించారు.  అయితే గాయం కారణంగా గైక్వాడ్ అందుబాటులో ఉంటాడా..? ఉండడా..? అన్న అనుమానాలకు చెక్ పెడుతూ అతడు క్యాంపుతో చేరడం విశేషం. గాయం కారణంగా అతడు లంకతో టీ20 సిరీస్ కు కూడా అందుబాటులో లేడు. 

610

ఎన్సీఏలో  రీహాబిటేషన్ కు వెళ్లిన గైక్వాడ్.. అక్కడ పూర్తిగా కోలుకున్న తర్వాత ఫ్రాంచైజీతో చేరాడు. ఈ మేరకు సీఎస్కే ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. గతేడాది ఐపీఎల్ సీజన్ లో టోర్నీలో అత్యధిక పరుగులతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు గైక్వాడ్. 

710

గైక్వాడ్  పై స్పష్టత వచ్చినా.. చెన్నై మాత్రం రూ. 14 కోట్లు పెట్టి వేలంలో దక్కించుకున్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్ విషయంలో మాత్రం  క్లారిటీ రావడం లేదు. 

810

విండీస్ తో టీ20ల సందర్భంగా బౌలింగ్ చేస్తూ గాయపడ్డ చాహర్.. ప్రస్తుతం ఎన్సీఏలో గడుపుతున్నాడు. అతడికి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో అతడు ఐపీఎల్ తొలి అంచెకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. 

910

అయితే ఏప్రిల్ 15 తర్వాతైనా చాహర్ ఐపీఎల్ ఆడతాడా..? లేదా..? అన్నదానిపై కూడా బీసీసీఐ.. చెన్నైకి ఎటూ తేల్చడం లేదు. భవిష్యత్ లో కీలక సిరీస్ లు ఉన్న నేపథ్యంలో అతడికి విశ్రాంతిని ఇస్తే మాత్రం చెన్నైకి అది పెద్ద ఎదురుదెబ్బే.. 

1010

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న  చెన్నై.. ఈనెల 26న  కోల్కతాతో తొలి మ్యాచులో బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories