IPL: ఢిల్లీకి బ్యాడ్ న్యూస్.. గుజరాత్ కు గుడ్ న్యూస్.. బీసీసీఐ యో యో టెస్టులో షాకింగ్ రిజల్ట్స్

Published : Mar 17, 2022, 11:10 AM ISTUpdated : Mar 17, 2022, 11:13 AM IST

IPL 2022: త్వరలో  ప్రారంభం కానున్న ఐపీఎల్ మెగా సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా బీసీసీఐ ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడు. 

PREV
18
IPL: ఢిల్లీకి బ్యాడ్ న్యూస్.. గుజరాత్ కు గుడ్ న్యూస్..  బీసీసీఐ యో యో టెస్టులో షాకింగ్ రిజల్ట్స్

ఐపీఎల్ మెగా సీజన్ కు కొద్దిరోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ పృథ్వీ షా.. బీసీసీఐ నిర్వహించిన  ‘యో యో టెస్టు’లో ఫెయిలయ్యాడు.
 

28

ఈ మాజీ అండర్-19 ప్రపంచ ఛాంపియన్.. పది రోజుల పాటు జాతీయ  క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణ తీసుకున్నాడు. అయితే  శిక్షణ ముగింపు సందర్భంగా బీసీసీఐ యో యో టెస్టును నిర్వహించింది.

38

ఈ టెస్టులో  నిర్దేశించిన కనీస స్కోర్ 16.5 కాగా.. పృథ్వీ షా మాత్రం 15 కంటే తక్కువ స్కోరు చేసినట్టు తెలుస్తున్నది.  అంటే యో యో టెస్టులో షా విఫలమయ్యాడని అర్థం.

48

మరోవైపు  గుజరాత్ టైటాన్స్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం టీమిండియాతో పాటు తన ఫ్రాంచైజీ గుజరాత్ అభిమానులకు  శుభవార్త చెప్పాడు.

58

యో యో పరీక్షకు పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ టెస్టులో కనీస స్కోరు కంటే ఎక్కువగా.. 17కి పైగా పాండ్యా స్కోర్ చేసినట్టు సమాచారం.  దీంతో అతడు  ఐపీఎల్ లో బౌలింగ్ వేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడు.

68

అయితే  ఇవి కేవలం ఫిట్నెస్ టెస్టు మాత్రమేనని, ఇందులో విఫలమైతే ఐపీఎల్ లో ఆడకుండా నియంత్రించలేమని బీసీసీఐ పేర్కొనడంతో పృథ్వీ షాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఊపిరి పీల్చుకుంది. 

78

ఇక ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందిస్తూ.. ‘షా వరుసగా మూడు రంజీ మ్యాచులు (ముంబయి తరఫున) ఆడి  ఎన్సీఏకు వచ్చాడు.  గ్యాప్ లేకుండా మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడినప్పుడు మీ శరీరం కూడా యో యో టెస్టుకు అంతగా సహకరించకపోవచ్చు..’ అని తెలిపాడు. 

88

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈనెల 27న ముంబై ఇండియన్స్ తో  బ్రబోర్న్ స్టేడియం వేదికగా తమ తొలి  మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.  రిషభ్ పంత్ సారథిగా వ్యవహరిస్తున్న ఢిల్లీకి.. షా ఓపెనర్ గా ఉన్నాడు. 

click me!

Recommended Stories