టీమ్‌ మారితే ఫ్యూచర్ బాగుంటుందని సంజూ శాంసన్‌కి కోచ్ సలహా... వచ్చే రూ.15 కోట్లలో రూ.2 కోట్లను వారి కోసం...

Published : Jun 14, 2023, 01:05 PM IST

ఐపీఎల్ 2008 సీజన్‌లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత రెండు సీజన్లలో మాత్రమే ప్లేఆఫ్స్ చేరింది. షేన్ వార్న్ తర్వాత షేన్ వాట్సన్, రాహుల్ ద్రావిడ్, స్టీవ్ స్మిత్, అజింకా రహానే వంటి కెప్టెన్లు మారినా టీమ్‌ని ఫైనల్ చేర్చలేకపోయారు..

PREV
19
టీమ్‌ మారితే ఫ్యూచర్ బాగుంటుందని సంజూ శాంసన్‌కి కోచ్ సలహా... వచ్చే రూ.15 కోట్లలో రూ.2 కోట్లను వారి కోసం...
Sanju Samson

2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్, 2022 సీజన్‌లో టీమ్‌ని రెండోసారి ఫైనల్ చేర్చాడు. అయితే గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది..

29
Sanju Samson and Dhruv Jural

2023 సీజన్ ఆరంభంలో 5 మ్యాచుల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ ఛాన్సులను మిస్ చేసుకుంది. ఓవరాల్‌గా 7 మ్యాచుల్లో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్, ఐదో స్థానంలో నిలిచింది..

39
Sanju Samson RR Trainer

ఐపీఎల్‌, దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నా టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోతున్న సంజూ శాసన్‌‌కి టీమ్ మారాల్సిందిగా సలహా ఇచ్చాడట ఆ టీమ్ ట్రైయినర్ రాజమణి ప్రభు. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ప్రభు...

49

‘ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత నేను సంజూ శాంసన్‌తో మాట్లాడాను. టీమ్ మారి, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ వంటి పెద్ద టీమ్స్‌కి ఆడితే, ఎక్కువ అవకాశాలు, పేరు, డబ్బు వస్తుందని చెప్పాను..

59
Sanju Samson

అయితే అతను మాత్రం తాను పెద్ద టీమ్స్‌కి ఆడడం కాదు, రాజస్థాన్ రాయల్స్‌ని పెద్ద టీమ్‌గా మారుస్తానని చెప్పాడు. చెప్పినట్టే అశ్విన్, చాహాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ప్లేయర్లను పట్టుకొచ్చాడు..

69

సంజూ శాంసన్ చాలా ముందుచూపుతో ఆలోచిస్తాడు. వాస్తవానికి 2022 వేలానికి ముందు సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ ఇస్తామని మూడు పెద్ద ఫ్రాంఛైజీలు ఆఫర్లు ఇచ్చాయి. అయితే అతను మాత్రం రాజస్థాన్‌లోనే ఉండాలని అనుకున్నాడు..

79

అతనికి వచ్చిన ఆఫర్, మరే ప్లేయర్‌కి వచ్చినా కచ్ఛితంగా వేరే టీమ్‌కి వెళ్లిపోయేవాళ్లు, కానీ సంజూ శాంసన్ విశ్వాసంగా ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాడు.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంజూకి సీజన్‌కి రూ.15 కోట్లు వస్తాయి..

89

ఇందులో కనీసం రూ.2 కోట్లను దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్న కుర్రాళ్ల కోసం, పిల్లల కోసం ఖర్చుపెడతాడు. ఇలా ఏ పెద్ద ప్లేయర్ కూడా చేయడు, చేయట్లేదు.

99

సంజూ శాంసన్ కేవలం మంచి బ్యాటర్ మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి కూడా. అందుకే అతనికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ ట్రైయినర్ రాజమణి ప్రభు.. 

click me!

Recommended Stories