కక్ష కట్టి, కావాలని వరల్డ్ కప్ ఆడకుండా చేశారు! విజయ్‌ శంకర్‌ కాకుండా... - అంబటి రాయుడు..

Published : Jun 14, 2023, 11:32 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం, ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది...

PREV
19
కక్ష కట్టి, కావాలని వరల్డ్ కప్ ఆడకుండా చేశారు! విజయ్‌ శంకర్‌ కాకుండా...  - అంబటి రాయుడు..
Ambati Rayudu

2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు రెండేళ్ల పాటు నాలుగో స్థానంలో ఆడుతూ వచ్చాడు అంబటి రాయుడు. అతని నిలకడైన పర్ఫామెన్స్‌తో వన్డే వరల్డ్ కప్‌లో రాయుడికి చోటు దక్కడం ఖాయమని అనుకున్నారంతా.. 

29

అయితే ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అంబటి రాయుడిని పట్టించుకోలేదు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్‌ని సెలక్ట్ చేసిన ఎమ్మెస్కే ప్రసాద్.. ‘విజయ్ శంకర్, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టీమ్‌కి త్రీడీ ప్లేయర్‌గా ఉపయోగపడతాడు’ అంటూ వ్యాఖ్యానించాడు..
 

39

ఈ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించిన అంబటి రాయుడు, ‘వన్డే వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ పెట్టా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అప్పట్లో పెను దుమారం క్రియేట్ చేసింది. ఈ ట్వీట్ కారణంగానే విజయ్ శంకర్ గాయపడిన తర్వాత కూడా అంబటి రాయుడిని పట్టించుకోకుండా రిషబ్ పంత్‌ని సెలక్ట్ చేశారు సెలక్టర్లు...
 

49

2019 వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో ఆడింది టీమిండియా. కెఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలగడంతో ఒకటికి నలుగురు వికెట్ కీపర్లను ఆడించింది భారత జట్టు..

59

రిటైర్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అంబటి రాయుడు, ఆంధ్రా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని చూస్తున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు అంబటి రాయుడు..

69

‘2019 వన్డే వరల్డ్ కప్‌లో నన్ను సెలక్షన్ చేయకపోవడానికి చాలా పెద్ద కుట్రే ఉంది. సెలక్షన్ కమిటీలో ఉన్నవారికి, నాకూ మధ్య కెరీర్ మొదట్లో కొన్ని గొడవలు ఉండేవి. వాటిని మనసులో పెట్టుకుని సమయం దొరికినప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు..

79

పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అది క్లబ్ మ్యాచో, లేక ఐపీఎల్ మ్యాచో కాదు కదా. వన్డే వరల్డ్ కప్.. దేశం పరువు. నన్ను సెలక్ట్ చేయకపోయినా నా ప్లేస్‌లో కరెక్ట్ బ్యాటర్‌ని ఎంపిక చేసి ఉన్నా నేను పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు...
 

89

అజింకా రహానే నాలుగో స్థానంలో బ్యాటర్. అతన్ని సెలక్ట్ చేసినా బాగుండేదేమో. విజయ్ శంకర్ ఆల్‌రౌండర్. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అతనంటే నాకు ఎలాంటి కోపం లేదు...

99

నాలుగో స్థానంలో బ్యాటర్ ప్లేస్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే ఓ ఆల్‌రౌండర్‌ని ఎంపిక చేయడమే నాకు కోపం తెప్పించింది...’ అంటూ వ్యాఖ్యానించాడు అంబటి రాయుడు.. 

click me!

Recommended Stories