KKRvsRR: అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు... భారీ స్కోరు చేయలేకపోయిన కేకేఆర్...

Published : Apr 24, 2021, 09:22 PM IST

IPL2021: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. భారీ స్కోర్లు, బౌండరీల వర్షం కురిసే వాంఖడే స్టేడియంలోనేనా మ్యాచ్ జరుగుతోంది? అనే అనుమానం కలిగేలా సాగింది కేకేఆర్ బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

PREV
18
KKRvsRR: అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు... భారీ స్కోరు చేయలేకపోయిన కేకేఆర్...

గత మ్యాచ్‌లో ఎదురైన అనుభవం కారణంగా ఆరంభం నుంచి నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు కేకేఆర్ ఓపెనర్లు నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్. ఇద్దరూ 5.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసినా 24 పరుగులు మాత్రమే చేయగలిగారు.

28

19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రనౌట్ కాగా... 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన నితీశ్ రాణా, సకారియా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

38

సునీల్ నరైన్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అవుట్ కాగా ఇయాన్ మోర్గాన్ బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి కొట్టిన షాట్‌ను అద్భుతంగా ఆపిన క్రిస్ మోరిస్, మరో ఎండ్‌లో ఉన్న మోర్గాన్‌ను రనౌట్ చేశాడు.

48

26 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, భారీ షాట్ కోసం ప్రయత్నించి ముస్తఫిజుర్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

58

క్రిస్ మోరిస్ వేసిన 18వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన ఆండ్రే రస్సెల్ 7 బంతుల్లో 9 పరుగులు చేసి, అదే ఓవర్‌లో మరో షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

68

రస్సెల్ అవుటైన ఓవర్‌ ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ కూడా అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన కార్తీక్, చేతన్ సకారియా పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...
 
78

6 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి, రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివమ్ మావి ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.

88

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో క్రిస్ మోరిస్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ముస్తాఫిజుర్, చేతన్ సకారియా, జయ్‌దేవ ఉనద్కడ్ తలా ఓ వికెట్ తీశారు. 
 
click me!

Recommended Stories