ఇదేం చెత్త కెప్టెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది... రోహిత్ శర్మపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

Published : Apr 24, 2021, 08:36 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటిదాకా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు ముంబై ఇండియన్స్‌కి. మొదటి మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న ముంబై, బౌలర్లు రాణించడంతో రెండు మ్యాచుల్లో గెలవగలిగింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌పై చిత్తుగా ఓడిన ముంబైపై ఫైర్ అయ్యాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

PREV
18
ఇదేం చెత్త కెప్టెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టుంది... రోహిత్ శర్మపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా 160 మార్కు అందుకోలేకపోయిన ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులకే పరిమితమైంది.... 

28

వరల్డ్ క్లాస్ భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఇండియన్స్, పవర్ ప్లే ముగిసేసమయానికి కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం, మొదటి బౌండరీ సాధించడానికి 30 బంతులు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

38

‘ముంబై ఇండియన్స్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది. మా దగ్గర భారీ హిట్టర్లు ఉన్నారు, మంచి బౌలర్లు ఉన్నారు. ఎలా ఆడినా గెలిచేస్తామనే ధీమా వారిలో కనిపిస్తోంది... అందుకే పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తోంది.

48

సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఈ సీజన్‌లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా ఉన్నాడు. అలాంటి సూర్యకుమార్ యాదవ్‌ను టూ డౌన్‌లో తీసుకురావడం చాలా చెత్త ప్రయోగం...

58

మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ప్రమోట్ చేయాలి అంతేకానీ డీమోట్ చేయడం మంచి వ్యూహం అనిపించుకోదు. ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నాడు. అతను ఫామ్‌లోకి రావడానికి, కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది.

68

ఈ విషయాన్ని రోహిత్ శర్మ గ్రహించలేకపోయాడు. ఇషాన్ కిషన్‌కు ప్రమోషన్ ఇవ్వడం, అతను కుదురుకోవడం సమయం తీసుకోవడంతో రోహిత్ శర్మపై కూడా ప్రెషర్ పెరిగింది... 

78

వన్‌డౌన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఉంటే, మొదటి బంతి నుంచే బౌలర్లపైకి ఎదురుదాడికి దిగేవాడు. అదీకాకుండా స్పిన్‌కి అద్భుతంగా ఆడగలడు. యాదవ్ తన ప్లేస్‌లో వచ్చి ఉంటే, రోహిత్‌ శర్మపై ప్రెషర్ తగ్గి ఉండేది...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

88

‘ఆరంభంలో రెండు, మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత నెమ్మదిగా ఆడితే భాగస్వామ్యం నిర్మిస్తున్నారని అనుకోవచ్చు. చేతిలో వికెట్లు ఉన్నా, భారీ హిట్టర్లు ఉన్నా... ముంబై ఇండియన్స్ ఇలా బ్యాటింగ్ చేయడం వారి ఓవర్ కాన్ఫిడెన్స్‌కి అద్దం పడుతోంది’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

click me!

Recommended Stories