రాహుల్ ద్రావిడ్, భారత జట్టును బెస్ట్ టీమ్ చేయాలని అనుకున్నాడు, కానీ సీనియర్లు మాత్రం... -గ్రెగ్ చాపెల్...

Published : May 21, 2021, 12:19 PM ISTUpdated : May 22, 2021, 03:35 PM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్, టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టులో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగించిన చాపెల్, ఆ తర్వాత దాదా జట్టులో స్థానం కోల్పోడానికి కూడా కారణమయ్యాడు. గంగూలీని పక్కనబెట్టి రాహుల్ ద్రావిడ్‌కి కెప్టెన్సీ అప్పగించిన చాపెల్, తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

PREV
19
రాహుల్ ద్రావిడ్, భారత జట్టును బెస్ట్ టీమ్ చేయాలని అనుకున్నాడు, కానీ సీనియర్లు మాత్రం... -గ్రెగ్ చాపెల్...

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీది అస్సలు కష్టపడే తత్వం కాదని, కానీ జట్టుపై ఆజమాయిషీ చేసేందుకు కెప్టెన్‌గా ఉండాలని కోరుకునేవాడని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

29

‘రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోసం చాలా కష్టపడ్డాడు. వరల్డ్‌లో బెస్ట్ టీమ్‌గా టీమిండియా ఉండాలని పరితపించేవాడు. కానీ జట్టులో ఉన్న చాలామందికి ఈ ఫీలింగ్ ఉండేది కాదు. చాలా మంది జట్టులో స్థానం కోసం కూడా కష్టపడేవాళ్లు కాదు...

39

రాహుల్ ద్రావిడ్ జట్టును ఎంతగా మార్చాలని ప్రయత్నించినా, కొందరు సీనియర్ల నుంచి అతనికి సరైన స్పందన, సాయం అందలేదు. ఎందుకంటే అప్పటికీ వారి కెరీర్‌ ముగింపు దశకు చేరుకోవడంతో జట్టులో ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని ఫీల్ అయ్యేవాళ్లు...

49

సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత భారత జట్టులో అటెన్షన్ వచ్చింది. సరిగా ఆడకపోతే ఏ ప్లేయర్‌కైనా జట్టులో చోటు ఉండదని వారికి అర్థమైంది...

59

గంగూలీని తప్పించి, రాహుల్ ద్రావిడ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన మొదటి ఏడాది భారత జట్టు అద్భుతాలు చేసింది. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కూడా గెలిచింది...

69

గంగూలీ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జట్టు మరింత కఠినంగా తయారైంది. ‘మేం మారం... ఇలాగే ఉంటాం’ అనే మొండి వైఖరి ప్లేయర్లలో నిండింది. అందుకే నా పదవీకాలం ముగిసిన తర్వాత బీసీసీఐ, నా కొత్త కాంట్రాక్ట్ ఆఫర్ చేసింది.

79

కానీ ఇలాంటి ఆటగాళ్లతో నిత్యం ఒత్తిడిని తీసుకోలేక... నేను టీమిండియా కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడలేదు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్...

89

సీనియర్ ప్లేయర్లు అంటూ సంబోధించి, ఆ ప్లేయర్లు ఎవరో పేర్లు చెప్పకపోయినా రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఆడిన జట్టులో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ఉండేవాళ్లు. వీరి గురించి గ్రెగ్ చాపెల్ కామెంట్ చేసి ఉండవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

99

గ్రెగ్ చాపెల్ కోచింగ్‌లో ఏడాది పాటు అద్భుతాలు చేసిన టీమిండియా, 2007 వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్కమించింది. పసికూన బంగ్లాదేశ్‌తో శ్రీలంకతో ఓడిన భారత జట్టు, నాకౌట్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ రిజల్ట్‌తో గ్రెగ్ చాపెల్‌ను కోచ్‌గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

click me!

Recommended Stories