అనిల్ కుంబ్లే బౌలింగ్, నాకు నిద్రపట్టకుండా చేసేది... కుమార సంగర్కర కామెంట్...

First Published May 21, 2021, 11:46 AM IST

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన అనిల్ కుంబ్లే... ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన కుంబ్లే, 271 వన్డేల్లో 337 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 35 సార్లు ఐదేసి వికెట్లు తీసిన కుంబ్లే, ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. 

ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు కుంబ్లే... భారత జట్టుకి టెస్టుల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహారించిన అనిల్ కుంబ్లే బౌలింగ్ గురించి, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కుమార సంగర్కర కామెంట్ చేశారు...
undefined
ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు కుంబ్లే... భారత జట్టుకి టెస్టుల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహారించిన అనిల్ కుంబ్లే బౌలింగ్ గురించి, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కుమార సంగర్కర కామెంట్ చేశారు...
undefined
కుంబ్లే వేగంగా బంతులు వేయగలడు, అలాగే వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ ఇబ్బందిపెట్టగలడు. అతని బౌలింగ్‌లో బంతి మిస్ అయిందో వికెట్ పోయినట్టే. కుంబ్లే బౌలింగ్‌లో పరుగులు చేయడం చాలా కష్టం...
undefined
బౌన్స్‌ వేస్తాడు, పేస్ క్రియేట్ చేస్తాడు. లెంగ్త్ బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడు. అతను చాలా లవ్లీ పర్సన్. ఎంతో ప్రతిభావంతుడైన క్రికెటర్ అంటే టీమిండియాకి, వరల్డ్ క్రికెట్‌కి అతను ఛాంపియన్‌ ప్లేయర్...’ అంటూ కామెంట్ చేశాడు కుమార సంగర్కర.
undefined
కుమార సంగర్కర సహచరుడు మహేళ జయవర్థనే కూడా అనిల్ కుంబ్లే బౌలింగ్‌ను పొగిడాడు. ‘అనిల్ కుంబ్లే బలాలు ఏంటో ఎవరు కచ్ఛితంగా అంచనా వేయలేరు. అతను ఏ బ్యాట్స్‌మెన్‌కి పరుగులు చేయడానికి అవకాశం ఇవ్వడు.
undefined
అనిల్ కుంబ్లే వేసే ప్రశ్నలకు సమాధానం వెతకడం అంత ఈజీ కాదు. నువ్వు ఎలాంటి బ్యాట్స్‌మెన్‌వి అయినా, అనిల్ కుంబ్లేని ఫేస్ చేస్తున్నావంటే నిన్ను అవుట్ చేయడానికి అతనిదగ్గర ప్లాన్ సిద్ధంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు జయవర్థనే...
undefined
పాక్ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా అనిల్ కుంబ్లేని ఓ భిన్నమైన బౌలర్‌గా వర్ణించాడు. ‘అతను ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం నాకు ఇంకా గుర్తింది. ఢిల్లీలో అతను మాపైనే ఆ ఫీట్ సాధించాడు. అతను తీసిన 10వ వికెట్ నేనే...
undefined
అనిల్ కుంబ్లే క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ ఇంకా నాకు నిన్నే జరిగినట్టు ఉంది. అతను చాలా డిఫరెంట్ బౌలర్, మిగిలిన లెగ్ స్పిన్నర్లు ఎవ్వరూ అతనికి పోటీ రాలేరు...’ అంటూ కామెంట్ చేశాడు వసీం అక్రమ్.
undefined
click me!