నాకు అవకాశం వస్తే వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్‌ల రికార్డు బ్రేక్ చేస్తా... కెఎల్ రాహుల్ కామెంట్...

Published : May 21, 2021, 10:42 AM IST

టెస్టుల్లో ఐదేళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న టీమిండియా... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఛాంపియన్‌ ఆటతీరుతో ఫైనల్‌కి అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియాలో కెఎల్ రాహుల్ కూడా చోటు దక్కించుకున్నాడు...

PREV
18
నాకు అవకాశం వస్తే  వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్‌ల రికార్డు బ్రేక్ చేస్తా... కెఎల్ రాహుల్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్‌కి వైద్యులు అపెండిక్స్ సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన స్వగృహంలోనే విశ్రాంతి తీసుకుంటున్న కెఎల్ రాహుల్, త్వరలోనే ముంబైలోని బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, భారత జట్టులో చోటు కూడా దక్కుతుంది.

28

2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన కెఎల్ రాహుల్, 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 199 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నప్పుడు భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

38

చెన్నైలో జరిగిన ఇదే టెస్టులో కరణ్ నాయర్ త్రిబుల్ సెంచరీ బాది, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు....

48

‘టెస్టు క్రికెట్ చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేను 199 పరుగుల వద్ద అవుట్ అయిన మ్యాచ్‌కి ముందు నేను గాయపడి, టీమిండియాకి దూరమయ్యాను. ఆ తర్వాత కోలుకుని, రీఎంట్రీ ఇచ్చి 199 పరుగులు చేశా...

58

డబుల్ సెంచరీ పూర్తిచేయలేకపోయినా ఆ ఇన్నింగ్స్‌ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రతీ బ్యాట్స్‌మెన్ సెంచరీకి, డబుల్ సెంచరీకి చేరువైనప్పుడు కచ్చితంగా ఎంతో కొంత ఒత్తిడికి లోనవుతాడు. నా విషయంలో కూడా అదే జరిగింది...

68

చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, నన్ను నేను మరింతగా మెరుగుపరుచుకోవడం నాకు అలవాటు. ఈసారి టెస్టుల్లో నాకు అవకాశం వస్తే కరణ్ నాయర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల రికార్డులు బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తా...’ అంటూ తెలిపాడు కెఎల్ రాహుల్.

78

టీమిండియా తరుపున 36 టెస్టులు ఆడిన కెఎల్ రాహుల్ 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2006 పరుగులు చేశాడు. ఆఖరిగా 2019 ఆగస్టులో వెస్టిండీస్‌పై టెస్టు మ్యాచ్ ఆడిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత తుదిజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.

88

ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులకు ఎంపికైన కెఎల్ రాహుల్, తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మూడో టెస్టులో కెఎల్ రాహుల్‌ను బరిలో దింపాలని భావించినా, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు లోకేశ్ రాహుల్...

click me!

Recommended Stories