మాట మార్చిన రాహుల్ ద్రావిడ్... శ్రీలంక టూర్‌లో సిరీస్ గెలవడమే లక్ష్యమంటూ...

First Published Jun 28, 2021, 1:30 PM IST

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా యువ జట్టు, లంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడబోతోంది...

లంక పర్యటనకు కోచ్‌గా ఎంపికైన తర్వాత సిరీస్‌కి ఎంపికైన ప్లేయర్లందరికీ అవకాశం వస్తుందని కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్.
undefined
‘సిరీస్‌కి ఎంపికై ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఎంపికైన ప్లేయర్లు అందరూ కనీసం ఒక్క మ్యాచ్ ఆడేలా చూస్తాను’ అంటూ చెప్పాడు ద్రావిడ్.
undefined
అయితే తాజాగా లంక టూర్‌కి బయలుదేరే ముందు శిఖర్ ధావన్‌తో కలిసి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ ద్రావిడ్... సిరీస్ గెలవడమే ప్రధాన లక్ష్యమని, అందరికీ అవకాశాలు దక్కుతాయని భరోసా ఇవ్వలేమని తేల్చేశాడు...
undefined
‘కుర్రాళ్లు అందరూ చాలా జోష్‌లో కనిపిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు, తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అందరికీ అవకాశం దక్కుతుందని చెప్పలేం...
undefined
టీ20 వరల్డ్‌కప్ దగ్గరికి వస్తోంది. కాబట్టి టోర్నీకి సరైన జట్టును సిద్ధం చేసేందుకు లంకతో జరిగే మూడు టీ20 మ్యాచుల సిరీస్ కూడా అవకాశం కావచ్చు...
undefined
అయితే కేవలం మూడు టీ20 మ్యాచులే ఆడడం వల్ల కుర్రాళ్లందరికీ అవకాశం ఇవ్వడం కుదరకపోవచ్చు... సిరీస్‌లో బాగా రాణించిన వాళ్లకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయి...
undefined
టీ20 వరల్డ్‌కప్‌కి ముందు సమర్థవంతమైన ప్లేయర్లను తయారుచేయడం చాలా కీలకం. సిరీస్ గెలవడమే మొదటి లక్ష్యం’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్.
undefined
శ్రీలంక టూర్‌కి రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, శిఖర్ ధావన్, పృథ్వీషా, నితీశ్ రాణా రూపంలో ఐదుగురు ఓపెనర్లను ఎంపిక చేశారు సెలక్టర్లు.
undefined
వీరిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఓపెనర్లుగా రాణిస్తున్న ధావన్, పృథ్వీషాలను ఓపెనర్లుగా ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్‌లో, దేవ్‌దత్ పడిక్కల్‌ను టూ డౌన్‌లో ఆడించొచ్చు. హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే ఉండడం ఖాయం.
undefined
స్పిన్నర్ల ప్లేస్ కోసం కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, కృష్ణప్ప గౌతమ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, కృనాల్ పాండ్యామధ్య పోటీ ఉండగా పేసర్ల స్థానం కోసం దీపక్ చాహార్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా వంటి ప్లేయర్ల మధ్య పోటీ నడుస్తోంది.
undefined
వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య పోటీ ఉంది. దీంతో 20 మందిలో తుదిజట్టులో 11 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. మ్యాచ్‌కి రెండు మార్పులతో బరిలో దిగినా అందరికీ అవకాశం దొరకడం అసాధ్యమే...
undefined
click me!