కెప్టెన్లు అట్టర్ ఫ్లాప్, ఆ టీమ్స్ మాత్రం సూపర్ హిట్... ఐపీఎల్ 2021లో ఎమ్మెస్ ధోనీ, మోర్గాన్‌ల ముందు...

Published : Oct 14, 2021, 11:00 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ క్లైమాక్స్‌కి చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్ ఫైట్‌లో టైటిల్ కోసం తలబడబోతున్నాయి... ఈ రెండు జట్లు సూపర్ సక్సెస్‌ సాధించి, ఫైనల్ చేరినా కెప్టెన్లు ఇద్దరూ మాత్రం సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు...

PREV
115
కెప్టెన్లు అట్టర్ ఫ్లాప్, ఆ టీమ్స్ మాత్రం సూపర్ హిట్... ఐపీఎల్ 2021లో ఎమ్మెస్ ధోనీ, మోర్గాన్‌ల ముందు...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. భారత జట్టుకి టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్ అందించి, సూపర్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాహీ... నాలుగో ఐపీఎల్ టైటిల్ కోసం తన అస్త్రాలను ప్రయోగించబోతున్నాడు...

215

సీఎస్‌కే జట్టుకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప ప్రధాన బలంగా మారారు. అయితే ఎమ్మెస్ ధోనీ మాత్రం ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

315

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్ అయిన ధోనీ, ఆ తర్వాత రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులాడి 18 పరుగులు చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...

415

సెకండాఫ్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగులు చేసిన ధోనీ, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో 1 పరుగు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు... 

515

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 18 పరుగులు, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 12 పరుగులు చేసిన ధోనీ... మొదటి క్వాలిఫైయర్‌లో 6 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు...

615

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం 10 ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసిన మాహీ, సగటు 16.28 మాత్రమే. ఢిల్లీతో జరిగిన క్వాలిఫైయర్ 1లో మాహీ ఆడిన ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కి సంతృప్తినిచ్చినా, అది మరీ ధోనీ రేంజ్ ఇన్నింగ్స్ అయితే కాదు...

715

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్, మాహీ కెరీర్‌లో 300వ టీ20 మ్యాచ్ కానుంది. అలాగే రవీంద్ర జడేజాకి 200వ ఐపీఎల్ మ్యాచ్ కాగా, అంబటి రాయుడికి 175వ, ఫాఫ్ డుప్లిసిస్‌కి 100వ ఐపీఎల్ మ్యాచ్ కానుంది...

815

అలాగే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు... 

915

ఐపీఎల్ 2021లో 16 మ్యాచులు ఆడిన మోర్గాన్, 11.72 సగటుతో 129 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 47 పరుగులు తీసి వేస్తే... మిగిలిన 15 మ్యాచుల్లో కలిపి చేసింది 82 పరుగులే...

1015

ఐపీఎల్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో నాలుగుసార్లు డకౌట్ అయిన మొట్టమొదటి కెప్టెన్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేసిన మోర్గాన్, ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ప్లేయర్‌గానూ టాప్‌లో నిలిచాడు...

1115

ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణమైన సగటు నమోదుచేసిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ఇయాన్ మోర్గాన్, 2021 సీజన్‌లో 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు...

1215

అయినా వికెట్ల వెనకాల దినేశ్ కార్తీక్, డగౌట్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్, బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, బౌలింగ్‌లో సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, శివమ్ మావి వంటి ప్లేయర్ల పర్ఫామెన్స్ కారణంగా కేకేఆర్ ఫైనల్ చేరింది...

1315

2019 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌ హోదాలో కేకేఆర్ పగ్గాలు చేపట్టిన మోర్గాన్, టైటిల్‌ను సిగ్గుపడకుండా తీసుకోవాలంటే మాత్రం అతని నుంచి ఫైనల్ మ్యాచ్‌లో అయినా తన రేంజ్ ఇన్నింగ్స్ రావాల్సిందే...  సీఎస్‌కే విషయంలోనూ అంతే... 

1415

ఈ ఇద్దరూ కెప్టెన్లు ఫెయిల్ అయినా, టీమ్ పర్ఫామెన్స్ కారణంగా రెండు జట్లూ సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే టైటిల్ ఫైట్‌లో ఈ ఇద్దరు వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల మధ్య హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధించినా... అవతలి కెప్టెన్ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతే ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు...

1515

ముందుండి నడిపించేవాడే అసలైన నాయకుడు. తాను రాణించకుండా, మిగిలిన ప్లేయర్ల పర్ఫామెన్స్‌తో టైటిల్ గెలిస్తే మాత్రం... ‘క్రెడిట్ స్టీలర్’ అంటూ ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది...

click me!

Recommended Stories