గౌతమ్ గంభీర్ మామూలోడు కాదు... మిలియనీర్ కూతురితో సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించిన కేకేఆర్ మాజీ కెప్టెన్...

First Published Oct 14, 2021, 12:11 PM IST

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగానే క్రికెటర్లలందు గౌతమ్ గంభీర్ వేరయా అనాల్సిందే.. ఎందుకంటే మిగిలిన ప్లేయర్ల యాటిట్యూడ్‌తో పోలిస్తే గౌతమ్ గంభీర్ కాస్త వెరైటీగానే ఉంటుంది... ఎవ్వరేం అనుకున్నా, పట్టించుకోకుండా హిజ్రాలకు సపోర్ట్ చేయడం కోసం చీర కట్టుకున్న గంభీర్, ఓపెన్‌గానే ధోనీ, కోహ్లీ వంటి కెప్టెన్లను విమర్శిస్తాడు...

2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత జట్టు ఆ రెండు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్... అలాంటి ఇన్నింగ్స్‌ల్లో ఎన్నో, మరెన్నో...

ఐపీఎల్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్‌లో ఉన్న గౌతమ్ గంభీర్, 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఫాలో‌ఆన్ పడిన తర్వాత 643 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి ‘టీమిండియా సెకండ్ వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు..

క్రీజులో కోపం వస్తే చాలు, వీరావేశంతో దూసుకెళ్లిపోయే గౌతమ్ గంభీర్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే నమ్మడం కాస్త కష్టమే... అయితే ఆన్‌ ఫీల్డ్ అలా ఉన్నా, ఆఫ్ ఫీల్డ్ గౌతమ్ గంభీర్ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్...

న్యూఢిల్లీలో జన్మించిన గౌతమ్ గంభీర్, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో 10వ ఏట నుంచి క్రికెట్ శిక్షణ తీసుకుంటున్నాడు. గంభీర్ తండ్రి దీపక్ గంభీర్ ఓ టెక్స్‌టైల్ వ్యాపారి... ఆయన స్నేహితుడు రవీంద్ర జైన్ చాలా పెద్ద బిజినెస్‌మ్యాన్...

కోట్లకు అధిపతి అయిన రవీంద్ర జైన్ కూతురే నటాశా జైన్. ఈ రెండు కుటుంబాల మధ్య దాదాపు 35 ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నటాశా, తరుచుగా గంభీర్ ఇంటికి వస్తుండేది..

అలా నటాశా, గౌతమ్ గంభీర్ మంచి స్నేహితులు అయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరైనా ఉంటే, వీరు ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు, ఎవ్వరూ లేనప్పుడు లవర్స్‌లా మారిపోయేవారు...

నటాశాకి క్రికెట్‌ అంటే పెద్దగా నచ్చేది కాదు. గంభీర్‌కి ఆమెలో ఎక్కువగా నచ్చిన విషయం కూడా అదే. తన స్నేహితులతో ఎవరితో మాట్లాడినా అటు తిరిగి, ఇటు తిరిగి డిస్కర్షన్ క్రికెట్‌కి వచ్చేది. అదే నటాశాతో అయితే ఆ సమస్యే లేదు. ఆమె క్రికెట్‌ గురించి అస్సలు మాట్లాడదు...

చూడడానికి సూపర్ హాట్ మోడల్‌లా మెరిసిపోయే నటాశా అందానికి కూడా గంభీర్ పడిపోయాడట. అప్పటికే క్రికెటర్‌గా గంభీర్ సక్సెస్ కావడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రాలేదు... 

2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు గంభీర్... ఇలా కొన్నాళ్లు రహస్యంగా సాగిన ప్రేమాయణం, పెద్దలు అంగీకారంతో మూడు ముళ్ల బంధంగా మారింది...  చాలా తక్కువ మంది ఆత్మీయులు, అతిథుల మధ్య అక్టోబర్ 28, 2011లో గంభీర్ పెళ్లి జరిగింది...

మీడియాకి దూరంగా ఉండే నటాశా, సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నటాశాకి పెళ్లికి ముందే దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి...

నటాశా, గౌతమ్ గంభీర్‌లకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నాడు. పెద్దమ్మాయి అజిన్ 2014 మేలో జన్మించగా, చిన్నమ్మాయి అనైజా 2017లో పుట్టింది. క్రికెట్, రాజకీయాలతో బిజీగా ఉండే గౌతీ, తీరిక దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తుంటాడు...

1981, అక్టోబర్14న జన్మించిన గౌతమ్ గంభీర్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. 2003 ఏప్రిల్ 11న భారత జట్టు తరుపున మొదటి మ్యాచ్ ఆడిన గంభీర్, 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడాడు...

1981, అక్టోబర్14న జన్మించిన గౌతమ్ గంభీర్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. 2003 ఏప్రిల్ 11న భారత జట్టు తరుపున మొదటి మ్యాచ్ ఆడిన గంభీర్, 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడాడు...

టీమిండియాకి ఆరు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, నూటికి నూరు శాతం సక్సెస రేటుతో అన్నింట్లోనూ విజయాలు అందించాడు. కేకేఆర్ కెప్టెన్‌గా రెండు ఐపీఎల్ టైటిల్ గెలిచిన గౌతమ్ గంభీర్, కామెంటేటర్‌గానూ అదరగొడుతున్నాడు..

click me!