టీ20 వరల్డ్‌కప్ 2021కి జట్టుని ప్రకటించిన ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు...

First Published Aug 19, 2021, 6:57 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి సైరన్ మోగింది. ఇప్పటికే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ, సెప్టెంబర్ 10లోగా అన్ని దేశాలు జట్లను ప్రకటంచాల్సిందిగా సూచించింది. ఇప్పటికే న్యూజిలాండ్, టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా జట్టును ప్రకటించింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాకి ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కొన్నాళ్లుగా గాయంతో బాధపడుతున్న ఫించ్, దాని నుంచి కోలుకుని... తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు...

ఆరోన్ ఫించ్‌తో పాటు వెస్టిండీస్, బంగ్లా టూర్‌లకు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కూడా తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు... టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరి ప్రదర్శన కీలకంగా మారనుంది...

నిజానికి కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్టీవ్ స్మిత్, యాషెస్ సిరీస్‌కి ఫిట్‌గా ఉండేందుకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాడు. అయితే విండీస్, బంగ్లా టూర్‌లలో ఆసీస్ టీమ్ చిత్తుగా ఓడింది...

వరుస మ్యాచుల్లో బంగ్లా వంటి చిన్న జట్టుతో కూడా చిత్తు కావడంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను తిరిగి జట్టులోకి రావాలని ఆదేశాలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. వీరితో పాటు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు...

స్టార్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌, టీ20 వరల్డ్‌కప్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, హజల్‌వుడ్, మ్యాక్స్‌వెల్ వంటి స్టార్లు అందరూ...టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ప్రిపరేషన్స్ కోసం ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనబోతున్నారు.

అయితే ప్యాట్ కమ్మిన్స్ మాత్రం ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. కమ్మిన్స్ భార్య త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఐపీఎల్‌కి దూరమయ్యాడు...

వెస్టిండీస్, బంగ్లాదేశ్ టూర్‌లో రాణించిన ఒకే ఒక్క ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కి టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చటు దక్కింది. అతనితో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్‌కి కూడా రిజర్వు ప్లేయర్‌గా ఈ టోర్నీలో అవకాశం ఇచ్చింది ఆసీస్...

బిగ్‌బాష్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన జోష్ ఇంగ్లీష్‌కి తొలిసారిగా పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఆరంగ్రేట క్రికెటర్ జోష్‌యే...

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కె రిచర్డ్‌సన్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా
రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్

click me!