ద్రావిడ్ 200 క్యాచులు పట్టాడు, మరి టీమిండియా ఫీల్డింగ్ ఇంత అధ్వానమా... - సునీల్ గవాస్కర్

First Published Dec 26, 2022, 12:00 PM IST

క్యాచులే మ్యాచులను గెలిపిస్తారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకి ఈ విషయం బాగా అర్థమైంది. ఛతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బ్యాటుతో రాణించబట్టి టీమిండియా టెస్టు సిరీస్ గెలిచింది కానీ లేదంటే ఇప్పటికి పరిస్థితి దారుణంగా ఉండేది...

మొదటి టెస్టులో భారత బ్యాటర్ల కారణంగా టీమిండియా భారీ స్కోరు చేసి, బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టి ఈజీ విజయాన్ని అందుకోగలిగింది. అయినా టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 100+ ఓవర్లు బ్యాటింగ్ చేసింది...

రెండో టెస్టులో టాస్ ఓడిపోవడంతోనే టీమిండియా కష్టాలు మొదలయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి స్వల్ప ఆధిక్యం దక్కినా, రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసింది బంగ్లాదేశ్. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లాదేశ్, భారత్‌పై 200+ స్కోరు చేయడం ఇదే మొదటిసారి...

ashwin

145 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించి భారత జట్టుకి విజయాన్ని అందించగలిగారు... బంగ్లా మరో వికెట్ తీసి ఉంటే రిజల్ట్ మారిపోయి ఉండేది...

Kohli-Pant Catch

ముఖ్యంగా ఫీల్డింగ్‌లో టీమిండియా చేసిన తప్పులు బంగ్లాదేశ్‌కి బాగా కలిసి వచ్చాయి. ప్రస్తుత భారత జట్టులో అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. రెండు క్యాచులు జారవిడచం హాట్ టాపిక్ అయ్యింది. ఈ డ్రాప్ క్యాచుల కారణంగా బతికిపోయిన లిటన్ దాస్.. 73 పరుగులు చేశాడు.

India vs Bangladesh

అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ ఇచ్చిన క్యాచ్‌ని డ్రాప్ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ని కూడా అందుకోలేకపోయాడు. ఈ క్యాచులను అందుకుని ఉంటే టీమిండియా టార్గెట్ 100లోపే ఉండేది...

‘స్లిప్స్‌లో ఉండే ఫీల్డర్లు, ప్రతీ సెకన్ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వాళ్లు మోకాళ్ల దగ్గర చేతులు పెట్టుకుని క్యాచ్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫోజులు పెట్టారు. అయితే చేతుల్లోకి వచ్చిన క్యాచులను మాత్రం అందుకోలేకపోతున్నారు...

భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ గొప్ప ఫీల్డర్. 200 క్యాచులకు పైగా అందుకున్న భారత ఫీల్డర్‌గా ఉన్నాడు. మరి టీమ్ ఫీల్డింగ్ విషయంలో అతను ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.. 

click me!