ద్రావిడ్, అతనితో కూర్చొని నిజానిజాలు చెప్పు... సునీల్ గవాస్కర్ సలహా...

Published : Feb 03, 2022, 08:18 PM IST

సౌతాఫ్రికా టూర్ ముగించుకున్న టీమిండియా, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి సిద్ధమైంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు కొందరు క్రికెటర్లు కరోనా బారిన పడినా, షెడ్యూల్‌లో మార్పులు చేసే ఆలోచనలో లేదు బీసీసీఐ...

PREV
112
ద్రావిడ్, అతనితో కూర్చొని నిజానిజాలు చెప్పు... సునీల్ గవాస్కర్ సలహా...

వెస్టిండీస్‌తో సిరీస్‌లో అందరి చూపును ఆకర్షిస్తున్న ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్... ఈ ముగ్గురి ఆటపైనే ఎక్కువ ఫోకస్ పడుతోంది...

212

పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారితే, ‘హిట్ మ్యాన్’ కెప్టెన్సీలో మాజీ కెప్టెన్ విరాట్ ఎలా ఆడతాడదనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది...

312

సౌతాఫ్రికా టూర్‌లో ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, రెండో వన్డేలో 85 పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేసిన రిషబ్ పంత్... వైట్ బాల్ క్రికెట్‌లో ఇంకా ఫిట్ కాలేకపోతున్నాడు...

412

టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా, వన్డే, టీ20ల్లో మాత్రం రిషబ్ పంత్‌ మెరుపులు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో అతనికి ఈ సిరీస్ కీలకంగా మారనుంది...

512

సౌతాఫ్రికా టూర్‌లో కూడా దక్కిన ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన రిషబ్ పంత్, నిర్లక్ష్యమైన షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు...

612

జోహన్‌బర్గ్‌లో కగిసో రబాడా బౌలింగ్‌లో రాష్ షాట్‌కి ప్రయత్నించి డకౌట్ అయిన రిషబ్ పంత్, మూడో వన్డేలో అదిలే ఫెలూక్వాయో బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి యత్నించి డకౌట్ అయ్యాడు...

712

‘రిషబ్ పంత్ చాలా టాలెంటెడ్ ప్లేయర్, అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా రిషబ్ పంత్ సొంతం...

812

అయితే అన్ని రోజులు మనవి కావు. అందుకే రిషబ్ పంత్ ఓ మ్యాచ్‌లో బాగా ఆడుతున్నాడని సంతోషించేలోపే, మరో మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా షాట్స్ ఆడుతూ పెవిలియన్ చేరుతున్నాడు...

912

బ్యాటింగ్ ఆర్డర్‌లో మిడిల్‌లో వచ్చే రిషబ్ పంత్, ఇలాంటి షాట్స్ ఆడి అవుట్ అయితే ఆ ప్రభావం టీమ్‌పై తీవ్రంగా పడుతుంది. స్కోరు వేగం పడిపోతుంది...

1012

నా ఉద్దేశం ప్రకారం రాహుల్ ద్రావిడ్, అతనితో కూర్చొని నిజానిజాలు మాట్లాడాలి. జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకుంటూ ఎలా ఆడాలో తెలియచేయాలి...

1112

సిడ్నీ టెస్టులో 96, బ్రిస్బేన్ టెస్టులో 89 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లు చాలా స్పెషల్. ఎందుకంటే టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి పరుగులు చేశాడు రిషబ్ పంత్...

1212

అతని నుంచి టీమ్ కోరుకునేది కూడా ఇదే. చివరిదాకా ఉంటు భాగస్వామ్యాలు నిర్మించే ప్లేయర్ ఉంటే, ఏ జట్టుకైనా ఢోకా ఉండదు. ధోనీ చేసింది అదే. పంత్‌ నుంచి చూడాల్సింది అదే...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Read more Photos on
click me!

Recommended Stories