అలాంటి వాళ్లు కోచ్ పదవికి పనికి రారు, రాహుల్ ద్రావిడ్ బెస్ట్ కోచ్ అవుతాడు... సచిన్ టెండూల్కర్ కామెంట్...

First Published Jul 2, 2021, 10:33 AM IST

శ్రీలంక టూర్‌కి హెడ్ కోచ్‌గా ఎంపికైన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టీమిండియాకి ఫ్యూచర్ కోచ్‌ కాబోతున్నాడంటూ టాక్ వినబడుతోంది. అయితే అదే నిజమైన రాహుల్ ద్రావిడ్, బెస్ట్ కోచ్‌లలో ఒకడిగా మారతాడంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు ఇచ్చే ముందు ట్రయల్స్‌లా లంక టూర్‌కి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ని ఎంపిక చేశారంటూ భారత మాజీ క్రికెటర్ రితిందర్ సింగ్ సోదీ కామెంట్ చేశాడు...
undefined
వచ్చే టీ20 వరల్డ్‌కప్‌తో భారత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుండడంతో కొత్త కోచ్‌గా ఎవరు ఉండబోతున్నారనే విషయం కూడా చాలా చర్చ నడుస్తోంది... అయితే టీమిండియా కోచ్‌గా ద్రావిడ్ బెస్ట్ అంటున్నారు ఫ్యాన్స్...
undefined
‘రాహుల్ ద్రావిడ్ చాలా డెడికేషన్ ఉన్న పర్సన్. అదీకాకుండా ఇప్పుడు శ్రీలంక టూర్‌కి ఎంపికైన ప్లేయర్లలో చాలామంది రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌‌లో ఆడి రాటుతేలినవాళ్లే...
undefined
కాబట్టి వారి నడిపించడం రాహుల్ ద్రావిడ్‌కి పెద్ద కష్టమేమీ కాదు. కోచ్‌‌గా ఉండే వ్యక్తి, ప్రధానంగా చేయాల్సింది రెండే రెండు విషయాలు. ఒకటి ఆటగాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేకుండా చూడడం...
undefined
డ్రెస్సింగ్ రూమ్‌లో ఆరోగ్యకరమైన, మంచి పోటీ వాతావరణం నెలకొనేలా చూడడం... ఈ రెండూ రాహుల్ ద్రావిడ్‌కి బాగా తెలిసిన విద్యలే.. ఆటగాళ్ల సమస్యలను తెలుసుకోలేని వాళ్లు, ప్లేయర్ల మధ్య మనస్పర్థలు తెచ్చి లాభపడాలనుకునేవారి కోచ్‌‌గా పనికిరారు...
undefined
ఒకప్పుడు కోచ్ అంటే చాలా పనులు చేయాల్సి వచ్చేది. ఒక్కో ప్లేయర్ పర్ఫామెన్స్‌ను గమనిస్తూ, వారికి టెక్నిక్స్, షాట్లు నేర్పించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ కారణంగా ఇప్పుడా సమస్య తీరిపోయింది...
undefined
ఐపీఎల్‌ వంటి లీగుల్లో పాల్గొంటున్న సమయంలోనే షాట్స్ ఎలా ఆడాలో, ఏ బంతిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలపై కోచ్ దృష్టి పెడితే సరిపోతుంది...
undefined
వాస్తవానికి లంక పర్యటనకి ఎంపికైన జట్టులో చాలామంది ప్లేయర్లు, టీనేజ్ నుంచే ద్రావిడ్ కోచింగ్‌ ఆడారు... ఇక సమస్య ఏంటి’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...
undefined
శ్రీలంక పర్యటనకు కెప్టెన్‌గా ఎంపికైన శిఖర్ ధావన్, ఇండియా ఏ తరుపున ఆడుతున్న సమయంలో రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో ఆడగా... నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, పృథ్వీషా వంటి కుర్రాళ్లు కూడా అండర్ 19 టీమ్‌లో ఆడారు.
undefined
click me!