ఆ పాప ముక్కు పగిలింది! ఆసుపత్రికి వెళ్లి చూస్తే... ఆర్‌సీబీ ఫ్యాన్ గర్ల్‌పై క్రిస్ గేల్ కామెంట్...

First Published Feb 8, 2023, 11:11 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ క్రికెటర్ క్రిస్ గేల్. గేల్ ఫీల్డ్‌లో ఉంటే ఫన్‌కి తిరుగుండదు. భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడే క్రిస్ గేల్, ఐపీఎల్‌లో దాదాపు 5 వేల పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరుపున నాలుగు సెంచరీలు చేసిన క్రిస్ గేల్, ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175) కూడా నమోదు చేశాడు...

క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి సూపర్ బ్యాటర్లతో దుర్భేద్యంగా కనిపించినా ఆర్‌సీబీ, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 2011 నుంచి 2017 వరకూ ఆర్‌సీబీలో ఉన్న క్రిస్ గేల్, తన బెస్ట్ మూమెంట్స్‌ని పంచుకున్నాడు...


‘‘నేను కొట్టిన ఓ సిక్సర్, నేరుగా వెళ్లి ఓ చిన్న పాప ముక్కుకు తగిలింది. అది చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. మ్యాచ్ అయిపోగానే హాస్పిటిల్‌కి వెళ్లి ఆమెను చూశా. ముక్కు అంతా రక్తం, బట్టల నిండా రక్తం... 

నన్ను చూసి ఆమె ‘ఎందుకు బాధపడుతున్నారు. బాధపడకండి. వెళ్లి ఇంకా సిక్సర్లు కొట్టండి...’ అని నవ్వేసింది. ఆమె మాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. తన మాటల వల్ల అప్పటిదాకా ఫీల్ అయిన బాధని మరిచిపోయాను...
 

తను అంత నొప్పిని భరిస్తూ కూడా నన్ను ఇంకా సిక్సర్లు కొట్టమని చెప్పింది. అది నా లైఫ్‌లో మోస్ట్ టచ్చింగ్ మూమెంట్. ఆ తర్వాతి మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్.. ‘నా ముక్కు విరగొట్టు...’ (Please break my nose) అని రాసి ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని వచ్చారు...

అలా చేస్తే, వాళ్లను ఆసుపత్రికి వెళ్లి కలుస్తానని వారి ఆశ. ఆర్‌సీబీ‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ప్రపంచంలో ఏ ఫ్రాంఛైజీలోనూ ఇలాంటి ఫ్యాన్స్‌ని చూడలేదు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ ఆడుతుంటే... ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ’ అని ఫ్యాన్స్ చేసే గోలలు, ఓ స్పెషల్ ఫీలింగ్ తీసుకొస్తాయి...

నేను పూణే వారియర్స్‌పై 175 పరుగులు చేసినప్పుడు, మధ్యలో ఏబీ డివిల్లియర్స్ వచ్చి 8 బాల్స్ ఆడి 30 పరుగులు చేశాడు. అతను అలా ఆడకుండా నాకు స్ట్రైయిక్ ఇచ్చి ఉంటే ఓ 215 కొట్టి ఉండేవాడిని... 

రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడడం నాకు ఎంతో ఇష్టం. నన్ను ఇబ్బందిపెట్టిన బౌలర్ ఇంకా పుట్టలేదు. ప్రతీ బౌలర్ గొప్పగానే బౌలింగ్ చేస్తాడు. ఎవరు బెస్ట్ బౌలర్ అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతీ బౌలర్ బౌలింగ్‌లో నేను భారీ సిక్సర్లు కొట్టాను...’’ అంటూ రాబిన్ ఊతప్ప చేసిన ‘హోమ్ ఆఫ్ హీరోస్’ షోలో చెప్పుకొచ్చాడు క్రిస్ గేల్..

click me!