శుబ్‌మన్ గిల్ మంచి ప్లేయరే కానీ పెద్దగా సక్సెస్ కాలేడు... గ్రేమ్ స్మిత్ సెన్సేషనల్ కామెంట్స్...

First Published Feb 8, 2023, 9:54 AM IST

మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్, భారత యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో, టీ20ల్లో సెంచరీలు బాదేసి టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గిల్... పెద్దగా సక్సెస్ కాలేడని వ్యాఖ్యానించాడు సఫారీ మాజీ కెప్టెన్...

‘శుబ్‌మన్ గిల్‌లో చాలా టాలెంట్ ఉంది. అంతకుమించి టెక్నిక్ కూడా ఉంది. అయితే ఓ ప్లేయర్, సుదీర్ఘ కాలం సక్సెస్ కావాలంటే నిత్యం తనని తాను మెరుగ్గా చేసుకుంటూ ఉండాలి. తన బలమేంటో, బలహీనతలు ఏంటో తెలియాలి...

టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌కి భారీ షాట్స్ ఆడడం మాత్రమే కాదు, డిఫెన్స్ టెక్నిక్ కూడా బాగా తెలియాలి. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలనే అవగాహన చాలా అవసరం. శుబ్‌మన్ గిల్‌లో ఇది నాకు కనిపించడం లేదు...
 

శుబ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్లు వైట్ బాల్ క్రికెట్‌లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే వన్డే, టీ20ల్లో స్టోక్ ప్లే ఉంటే చాలు, పరుగులు చేయొచ్చు. అయితే టెస్టు క్రికెట్‌లో అలా కాదు. ఓ గేమ్ ప్లాన్‌తో బ్యాటింగ్‌కి రావాలి...

ఓ ప్లేయర్‌గా శుబ్‌మన్ గిల్ బాగా ఆడుతున్నాడు... అయితే సుదీర్ఘ కాలం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ మాత్రం అతనిలో కనిపించడం లేదు. ఒకవేళ అతను ఇంకా కొన్ని టెస్టులు ఆడితే ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటాడేమో...

KL Rahul

టీమిండియాతో అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ ఉన్న సమస్య ఇదే. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరిని పెట్టాలనేది డిసైడ్ చేయడం చాలా కష్టం. కెఎల్ రాహుల్‌ని పక్కనబెట్టడం కుదరదు. అది కరెక్ట్ నిర్ణయం కూడా కాదు...

Image credit: Getty

ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడితే, శ్రేయాస్ అయ్యర్ కోలుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉంటే, ఇదే సమస్య...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్..
 

click me!