రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ఫీట్... షేన్ వార్న్, స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఒకే ఒక్కడిగా...

Published : Feb 09, 2023, 02:31 PM ISTUpdated : Feb 09, 2023, 02:44 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ బౌలింగ్‌ని ఫేస్ చేసేందుకు ఇబ్బంది పడే స్టీవ్ స్మిత్, అతనిలా బౌలింగ్ చేసే మహేశ్ పిథియాని నెట్ బౌలర్‌గా పెట్టుకుని ప్రాక్టీస్ చేశాడు..

PREV
15
రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ఫీట్... షేన్ వార్న్, స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఒకే ఒక్కడిగా...
Image credit: PTI

అశ్విన్ ఫేస్ చేయడానికి ఆస్ట్రేలియా తీవ్రమైన ప్రాక్టీస్ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, అతన్ని అమ్ములపొదిలో అట్టిపెట్టుకున్నాడు. సిరాజ్, షమీ, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ వేసిన తర్వాత ఆఖరిగా అశ్విన్‌కి బాల్ అందించాడు రోహిత్ శర్మ...
 

25
Ravichandran Ashwin

మొదటి 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, 11వ ఓవర్‌లో తొలి వికెట్ అందించాడు. 33 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ వికెట్‌తో తన టెస్టు కెరీర్‌లో 450 వికెట్లు పూర్తి చేసుకున్నాడు అశ్విన్...

35

అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత టీమిండియా తరుపున 450 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 80 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది 89వ టెస్టు... అనిల్ కుంబ్లే 93 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించాడు...

45

బంతుల వారీగా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ 23474 బంతుల్లో 450 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 23635 బంతుల్లో ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 3 వేల పరుగులు, 450 వికెట్లు తీసిన మూడో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్...

55

ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఆసియాలో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బౌలర్ అశ్వినే.. 

click me!

Recommended Stories