నేను ఎవరికీ పోటీ కాదు, నాతో నాకే పోటీ! విరాట్ కోహ్లీ బాగా ఆడుతుంటే... - స్టీవ్ స్మిత్

First Published Feb 9, 2023, 11:34 AM IST

ప్రస్తుతం టెస్టుల్లో గ్రేటెస్ట్ బ్యాట్స్‌‌మెన్ ఎవరంటే నిస్సందేహంగా వినిపించే పేరు స్టీవ్ స్మిత్. ఫ్యాబ్ 4గా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ టెస్టు మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పోటీపడుతున్న స్టీవ్ స్మిత్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

Virat Kohli-Steve Smith

‘నేను ఎవ్వరికీ పోటీ కాదు. నాతో నాకే పోటీ. మరో ప్లేయర్‌తో నన్ను పోల్చుకుని చూడడం నాకు ఇష్టం ఉండదు. విరాట్ కోహ్లీతో నాకు ఎలంటి విబేధాలు లేవు. నాకు తెలిసి కోహ్లీ కూడా అంతే. గేమ్ వరకే ఏదైనా...

టీమ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండడమే మంచి ప్లేయర్లు చేయగలిగేది. ఆస్ట్రేలియా టీమ్ విజయానికి కావాల్సిన పరుగులు చేయడంపైనే నేను ఫోకస్ పెట్టాను. విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం చాలా కష్టం...

బౌలర్లను ప్రెజర్ పెట్టి, పరుగులు చేయడం విరాట్ కోహ్లీ బలం. ప్రపంచంలో ప్రతీ చోట విరాట్ కోహ్లీ పరుగులు చేశాడు. అతనికి ఉండేంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే మూడు ఫార్మాట్లలో కోహ్లీలా ఆడడం అసాధారణమైన విషయం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్...

విరాట్ కోహ్లీ 27వ టెస్టు సెంచరీ చేసిన సమయంలో స్టీవ్ స్మిత్ 24 సెంచరీలు మాత్రమే చేశాడు. అయితే ప్రస్తుతం 30 సెంచరీలు అందుకున్న స్టీవ్ స్మిత్, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్రస్తుత తరం క్రికెటర్‌గా టాప్‌లో నిలిచాడు...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో 18 సెంచరీలు చేసిన సమయంలో విరాట్, టెస్టుల్లో ఆఖరి సెంచరీ బాదాడు. ప్రస్తుతం జో రూట్ ఖాతాలో 29 సెంచరీలు ఉండగా కోహ్లీ మాత్రం మూడేళ్లుగా 27వ సెంచరీ దగ్గరే ఆగిపోయాడు...
 

click me!