కెఎల్ రాహుల్‌పై ఎందుకింత ప్రేమ? టీమ్‌లో సెట్ కాకున్నా ఎందుకు ఆడిస్తున్నారు... - కపిల్ దేవ్

First Published Feb 9, 2023, 11:02 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్‌కి తుదిజట్టులో అవకాశం దక్కలేదు. కెఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా కొనసాగించిన టీమిండియా మేనేజ్‌మెంట్, సూపర్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది...

KL Rahul

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో పెళ్లి చేసుకున్న కెఎల్ రాహుల్, పెళ్లైన రెండు రోజులకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. బంగ్లాదేశ్ టూర్‌లో టీమిండియాకి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్, టెస్టుల్లో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు...

‘కెఎల్ రాహుల్‌పై టీమిండియాకి ఎందుకు ఇంత ప్రేమ? అతన్ని ఎందుకు తప్పించరు? వైస్ కెప్టెన్ అయితే తప్పకుండా ఆడాల్సిందే అనే రూల్ ఎక్కడా లేదు. టీమ్ కాంబినేషన్ కంటే ఏదీ ముఖ్యం కాదు... టీమ్‌కి ఎవరు కావాలనిపిస్తే వాళ్లని ఆడించాలి...
 

భారత క్రికెట్‌లో ఎప్పుడూ కూడా వైస్ కెప్టెన్ అనేవాళ్లు లేరు. కేవలం నామమాత్రంగా మాత్రమే వైస్ కెప్టెన్లను సెలక్ట్ చేస్తారు. ఇంతకుముందైతే ప్రతీ టెస్టు మ్యాచ్‌కి ఓ కొత్త వైస్ కెప్టెన్ ఉండేవాడు. కెఎల్ రాహుల్ చాలా మెచ్యూర్డ్ ప్లేయర్...
 

రాహుల్ అంటే నాకు కూడా అభిమానమే. అతను మంచి బ్యాటర్ కూడా. అయితే టీమ్‌లో సెట్ కాకపోతే ఎవ్వరినైనా టీమ్‌లో నుంచి తీసేయాల్సిందే. టీమ్ గురించి ఆలోచిస్తే నేనైతే కెఎల్ రాహుల్‌ని ఆడించను...

Image credit: PTI

శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ చేసి అద్భుతమైన టచ్‌లో కనిపిస్తున్నాడు. అతన్ని ఆడిస్తే టీమిండియా విజయావకాశాలు పెరుగుతాయి.. 

కొందరు ప్లేయర్లు కేవలం లక్ కలిసి రావడంతో టీమిండియాకి ఆడేస్తారు. రాహుల్ ద్రావిడ్ కూడా వికెట్ కీపింగ్ చేస్తూ చాలా మ్యాచులు ఆడేశాడు. అతను పెద్దగా రాణించకపోయినా వికెట్ కీపింగ్ చేయడం వల్లే అతన్ని ఆడించేవాళ్లు.. ఇప్పుడు కెఎల్ రాహుల్ కూడా అదే కోవకి వస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...

click me!