PBKSvsDC: చెలరేగిన కెఎల్ రాహుల్, మయాంక్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు...

Published : Apr 18, 2021, 09:14 PM IST

IPL 2021 సీజన్‌లో ఒకేరోజు రెండు భారీ స్కోరింగ్ మ్యాచులు చేసే అదృష్టం క్రికెట్ ఫ్యాన్స్‌కి దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు చేసింది...

PREV
18
PBKSvsDC: చెలరేగిన కెఎల్ రాహుల్, మయాంక్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు...

గత రెండు మ్యాచుల్లో పెద్దగా పర్పామ్ చేయలేకపోయిన మయాంక్ అగర్వాల్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు కెఎల్ రాహుల్ కూడా సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది...

28

36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న లుక్మన్ మెరివాలా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

38

మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం...

48

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత మరింత వేగంగా ఆడిన కెఎల్ రాహుల్, 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి... రబాడా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

58

‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ 9 బంతుల్లో ఓ సిక్స్‌తో 11 పరుగులు చేసి... క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 158 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్...

68

నికోలస్ పూరన్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు... 179 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది పంజాబ్...

78

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హిట్టింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ కగిసో రబాడా 4 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 43 పరుగులు సమర్పించుకోవడం విశేషం...

88

వస్తూనే బౌండరీ బాదిన యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్, ఆ తర్వాత ఓ ఫోర్, సిక్సర్ బాది 15 పరుగులు రాబట్టాడు... దీపక్ హుడా 13 బంతుల్లో 2  సిక్సర్లతో 22 పరుగులు చేశాడు.

click me!

Recommended Stories