మనీశ్ పాండేను జట్టులో నుంచి తీసేయండి, అప్పుడు కానీ... ప్రజ్ఞాన్ ఓజా షాకింగ్ కామెంట్...

Published : Apr 18, 2021, 08:07 PM IST

IPL 2021 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడు మ్యాచుల్లోనూ విజయం దాకా వచ్చి, మిడిల్ ఆర్డర్ పరాజయంతో విజయాన్ని అందుకోలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ... జట్టులోని సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

PREV
113
మనీశ్ పాండేను జట్టులో నుంచి తీసేయండి, అప్పుడు కానీ... ప్రజ్ఞాన్ ఓజా షాకింగ్ కామెంట్...

టాపార్డర్‌లో జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఆకట్టుకుంటున్నా జట్టులో ఉన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన మనీశ్ పాండే మాత్రం స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

213

దీంతో మనీశ్ పాండే మళ్లీ గాడిలో పడాలంటే, అతన్ని జట్టులో తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా...

313

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓడుతోంది. వారికి ఇప్పుడు అనుభవం ఉన్న కేదార్ జాదవ్ లాంటి బ్యాట్స్‌మెన్ అవసరం... మిడిల్ ఆర్డర్‌లో జాదవ్ చక్కగా ఉపయోగపడతాడు...

413

బెయిర్ స్టో అందించిన మెరుపు ఆరంభాన్ని కూడా సన్‌రైజర్స్ ఉపయోగించుకోలేకపోయింది. అంటే మన బ్యాటింగ్ లైనప్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు...

513

మనీశ్ పాండే సీనియర్ బ్యాట్స్‌మెన్. అయితే అతను జట్టుకు విజయాలను అందించాల్సిన బాధ్యతను తీసుకోవడం లేదు. రెండు, మూడు మ్యాచులకు మనీశ్ పాండేని పక్కనబెట్టేయాలి...

613

ఇలా చేస్తే, తాను చేస్తున్న తప్పులు ఏంటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే అవకాశం మనీశ్ పాండేకి దక్కుతుంది... అతని కంటే జాదవ్‌ని నమ్ముకుంటే బెటర్ ఫలితం వస్తుంది...

713

మనీశ్ పాండేతో పోలిస్తే కేదార్ జాదవ్ బౌలింగ్ కూడా చేయగలడు. పాండేకి ఇప్పుడు బ్రేక్ చాలా అవసరంలా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు ప్రజ్ఞాన్ ఓజా... 

813

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన మనీశ్ పాండే... మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా జట్టుకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు...

913

అదీకాకుండా బౌండరీలు బాదాల్సిన సమయంలో సింగిల్స్ తీస్తూ కాలయాపన చేశాడు మనీశ్ పాండే. చివర్లో అబ్దుల్ సమద్ వచ్చి రెండు సిక్సర్లు బాదినా, అప్పటికే రన్‌రేట్ పెరిగిపోవడంతో సన్‌రైజర్స్‌కి విజయం దక్కలేదు...

1013

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అయితే 39 బంతుల్లో 38 పరుగులు చేసిన మనీశ్ పాండే ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ ఉన్నాయి...

1113

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే మరీ దారుణం. బెయిర్ స్టో సునామీ ఇన్నింగ్స్ కారణంగా విజయానికి చేరువైన సన్‌రైజర్స్‌ను ఆ మార్జిన్ దాటించాల్సిన సీనియర్ ప్లేయర్ మనీశ్ పాండే, 7 బంతులాడి 2 పరుగులే చేసి అవుట్ అయ్యాడు... బెయిర్ స్టో హిట్ వికెట్ రూపంలో అవుట్ కావడం, డేవిడ్ వార్నర్, అబ్దుల్ సమద్ రనౌట్ కావడంతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది...

1213

‘మనీశ్ పాండేకి జట్టును గెలిపించే సత్తా లేదు, అందుకే అతను టీమిండియాలో చోటు కోల్పోయాడు’ అని భారత మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా షాకింగ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. 

1313

ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన మనీశ్ పాండేకి ఏటా రూ.11 కోట్లు పారితోషికంగా చెల్లిస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్..

click me!

Recommended Stories