రాయల్ ఛాలెంజర్స్‌కి మరో ఫెయిల్యూర్... ఆర్‌సీబీని చుట్టేసిన పంజాబ్ కుర్రాళ్లు...

Published : Apr 30, 2021, 11:09 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌‌ను వరుస విజయాలతో ప్రారంభించిన ఆర్‌సీబీకి మరో ఓటమి ఎదురైంది. సీఎస్‌కే చేతిలో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చేతిలోనూ అదే సీన్ రిపీట్ చేశారు. 180 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆర్‌సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకి పరిమితమైంది. దీంతో పంజాబ్ కింగ్స్‌కి 34 పరుగుల తేడాతో అద్భుత విజయం దక్కింది.

PREV
16
రాయల్ ఛాలెంజర్స్‌కి మరో ఫెయిల్యూర్... ఆర్‌సీబీని చుట్టేసిన పంజాబ్ కుర్రాళ్లు...

మంచి ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్, మెడెరిత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ. ఆ తర్వాత రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో రన్‌రేట్ మందగించింది.

26

34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసిన హర్‌ప్రీత్ బ్రార్, ఆ తర్వాతి బంతికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను డకౌట్ చేశాడు. బ్రార్ వేసిన బంతి, వికెట్లను గిరాటేయడంతో ఏం జరిగిందో అర్థం కాక, కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు మ్యాక్స్‌వెల్.

36

ఆ తర్వాతి ఓవర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న డేంజరస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ కూడా హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన బ్రార్, కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

46

30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన రజత్ పటిదార్, జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 91 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

56

11 బంతుల్లో 8 పరుగులు చేసిన షాబజ్ అహ్మద్‌ను అవుట్ చేసిన రవి బిష్ణోయ్, ఆ తర్వాతి బంతికి డానియల్ సామ్స్‌ని అవుట్ చేశాడు. ఒకానొక దశలో 62/1 వద్ద ఉన్న ఆర్‌సీబీ, వరుస వికెట్లు కోల్పోయి 96/7 వద్దకు చేరుకుంది. 

66

ఆ తర్వాత హర్షల్ పటేల్, కేల్ జెమ్మిసన్ కలిసి బౌండరీలు బాదుతూ ఓటమి అంతరాన్ని తగ్గించారు. హర్షల్ పటేల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేయగా జెమ్మీసన్ 11 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. 

click me!

Recommended Stories