కెఎల్ రాహుల్ ‘క్లాస్’, క్రిస్ గేల్ ‘మాస్’ బాదుడు... రాయల్ ఛాలెంజర్స్ ముందు భారీ టార్గెట్...

First Published Apr 30, 2021, 9:20 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన కెఎల్ రాహుల్, మరోసారి రేసులో టాప్‌లోకి దూసుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తనదైన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకుని, పంజాబ్ కింగ్స్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. మాయంక్ అగర్వాల్ స్థానంలో వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి జెమ్మీసన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, తన స్టైల్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. జెమ్మీసన్ వేసిన ఓవర్‌లో ఐదు ఫోర్లు బాది, 20 పరుగులు రాబట్టిన క్రిస్ గేల్, ఆ తర్వాత యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది 15 పరుగులు రాబట్టాడు.
undefined
24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన క్రిస్ గేల్‌, డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ మరోసారి డకౌట్ అయ్యాడు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో సున్నాకే అవుట్ కావడం పూరన్‌కి ఇది నాలుగోసారి. ఓ మ్యాచ్‌లో బంతులేమీ ఎదుర్కోకుండా డకౌట్ అయిన పూరన్, ఆ తర్వాత ఒక్క బంతికి, రెండు బంతులకు, మూడు బంతులకు డకౌట్ అయ్యి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
దీపక్ హుడా 9 బంతుల్లో 5 పరుగులు చేసి షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా షారుక్ ఖాన్‌ను యజ్వేంద్ర చాహాల్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి దూకుడుగా ఆడాడు కెఎల్ రాహుల్.
undefined
హర్షల్ పటేల్ బౌలింగ్‌ ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టింది పంజాబ్ కింగ్స్. హర్‌ప్రీత్ బ్రార్ 17 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 25 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
undefined
click me!