అతను వీరేంద్ర సెహ్వాగ్ లాంటోడు, సరిగ్గా వాడుకుంటే... పృథ్వీషాపై మైకెల్ క్లార్క్...

Published : Feb 03, 2022, 12:55 PM IST

టీమిండియాలోకి సంచలనంగా దూసుకొచ్చాడు యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా. సచిన్ టెండూల్కర్ హైట్, వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్, బ్రియాన్ లారా టెక్నిక్ కలగలిపితే పృథ్వీషా అంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి కితాబు ఇచ్చాడు కూడా. అయితే ఒకే ఒక్క టెస్టు మ్యాచ్, అతని కెరీర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది...

PREV
19
అతను వీరేంద్ర సెహ్వాగ్ లాంటోడు, సరిగ్గా వాడుకుంటే... పృథ్వీషాపై మైకెల్ క్లార్క్...

ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ టెస్టులో బరిలో దిగిన పృథ్వీషా, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మొదటి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

29

ఆ మ్యాచ్‌ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో పృథ్వీషాకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సిరీస్ తర్వాత టీమిండియా సెలక్టర్ల నుంచి పృథ్వీషాకి పిలుపు కూడా రాలేదు...

39

భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు శ్రీలంకలో పర్యటించిన జట్టులో పృథ్వీషాకి చోటు దక్కింది. అయితే నాలుగు మ్యాచులు ఆడిన తర్వాత భారత బృందాన్ని కరోనా తాకడంతో అక్కడ కూడా షాకి నిరాశే ఎదురైంది...

49

ఆరంగ్రేటం టెస్టులోనే వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన పృథ్వీషా, ఇప్పటిదాకా ఐదు టెస్టులు ఆడి 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి... 

59

‘పృథ్వీషా కూడా సెహ్వాగ్‌లా ఓ అద్భుతమైన ప్లేయర్. వీరేంద్ర సెహ్వాగ్ ఓ బ్యాటింగ్ జీనియస్. అతను క్రీజులో ఉంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. నాకు అలాంటి ప్లేయర్లు అంటేనే బాగా ఇష్టం...

69

టాపార్డర్‌లో అలాంటి దూకుడైన బ్యాట్స్‌మెన్ ఉండాలి. అందుకే నాకు వీరేంద్ర సెహ్వాగ్ అంటే బాగా ఇష్టం. పృథ్వీషా కూడా సెహ్వాగ్‌లాగే దూకుడైన ప్లేయర్. అతని టెక్నిక్ కూడా అద్భుతం...

79

టీమిండియా, అతనిపై నమ్మకం ఉంచితే మంచితే. పృథ్వీషా ఇంకా యువకుడే. అతనికి చాలా కెరీర్ ఉంది. ఈ వయసులోనే అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించడం అత్యాశే అవుతుంది...

89

అతనికి కాస్త సమయం కావాలి. ఆస్ట్రేలియా టూర్‌లో అతను ఒకే మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడని మళ్లీ అతనికి అవకాశమే ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఎలా ఉంటాయో అతనికి తెలీదు...

99

ఆస్ట్రేలియాలో మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడే భారీ ఇన్నింగ్స్‌లు రావాలంటే వీలయ్యే పని కాదు. అతని నుంచి సెహ్వాగ్ లాంటి బ్యాట్స్‌మెన్ తయారుకావాలంటే పృథ్వీషాకి వీలైనంత సమయం, అవకాశాలు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్...

click me!

Recommended Stories