నేను సక్సెస్ అయి వుంటే, ధోనీకి ఛాన్స్ వచ్చేది కాదు... మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్...

First Published Jul 23, 2021, 10:44 PM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత అతిపిన్న వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌ పార్థివ్ పటేల్. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి, భారీ అంచనాలతో భారత జట్టులోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్... ఆశించిన స్థాయిలో పర్పామెన్స్ ఇవ్వలేకపోయాడు...

పార్థివ్ పటేల్ ఫెయిల్ కావడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను మారుస్తూ పోయింది టీమిండియా. అలా దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి వచ్చారు. ధోనీ సూపర్ సక్సెస్ కావడంతో పార్థివ్ పటేల్, రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు...
undefined
‘చాలామంది మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా నా కెరీర్ సజావుగా సాగలేదని అంటుంటారు. అయితే నిజం చెప్పాలంటే నేను సక్సెస్ అయ్యి ఉంటే ధోనీకి టీమ్‌లో దొరకడమే కష్టమైపోయేది...
undefined
నేను టీమిండియా తరుపున 19 టెస్టులు ఆడాను. చాలా మంది కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులే ఆడాను. కాబట్టి నేనెప్పుడూ నా ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి ఫీల్ అవ్వడం లేదు....
undefined
రిషబ్ పంత్ టీమిండియా భవిష్యత్తు. అతను ఓ అద్భుతమైన క్రికెటర్. పంత్ టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉన్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్.
undefined
17 ఏళ్ల వయసులో టీమిండియా తరుపున టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ఎంట్రీ ఇచ్చిన పార్థివ్ పటేల్, ఇప్పటికీ అతిచిన్న వయసులో టెస్టు ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్‌గా ఉన్నాడు.
undefined
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 194 మ్యచులు ఆడి 11 వేలకు పైగా పరుగులు చేసిన పార్థివ్ పటేల్, 486 క్యాచులు, 77 స్టంపౌట్లలో భాగం పంచుకున్నాడు. అయితే అంతర్జాతీయ కెరీర్‌లో మాత్రం పార్థివ్ పటేల్, 65 మ్యాచులు ఆడి 1700లకు పైగా పరుగులు చేశాడు.
undefined
జనవరి 4, 2002లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ వన్డే ఎంట్రీ ఇచ్చిన పార్థివ్ పటేల్... ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు... డిసెంబర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించాడు పార్థివ్ పటేల్.
undefined
click me!