వాళ్లు బౌలింగ్ చేస్తుంటే, మీరు భోజనాలు చేస్తున్నారా... భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ బిన్నీ ఆగ్రహం...

Published : Jun 25, 2021, 12:53 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత బౌలర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా, ఇషాంత్, షమీ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతారని ఫ్యాన్స్ భావించారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో జరిగింది మాత్రం రివర్స్...

PREV
111
వాళ్లు బౌలింగ్ చేస్తుంటే, మీరు భోజనాలు చేస్తున్నారా... భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ బిన్నీ ఆగ్రహం...

తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లు తొలి వికెట్ తీయడానికి 46 ఓవర్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు...

211

తొలి ఇన్నింగ్స్‌లో డివాన్ కాన్వే వికెట్ తీసిన ఇషాంత్ శర్మ... టీమిండియా కావాల్సిన జోష్‌ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.

311

తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయగలిగిన టీమిండియా పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్ తీయలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి దక్కిన రెండు వికెట్లూ అశ్విన్ తీసినవే...

411

‘సౌంతిప్టన్‌లో భారత బౌలింగ్ ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. ఇంగ్లాండ్‌ కండీషన్స్‌లో టెస్టుల్లో బౌలింగ్ చేయడం ఇలా కాదు. ఇది నిజంగా ఓ ఘోర అవమానం...

511

ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియాను ఆలౌట్ చేయగలిగారు. కానీ మనవాళ్లు? వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బౌలింగ్ చేయాల్సింది ఇలాగేనా...

611

వాళ్లు టెస్టు మ్యాచ్ ఆడుతున్నామనే ఫీలింగ్ కూడా లేకుండా బౌలింగ్ చేసినట్టు కనిపించింది. ఇంగ్లాండ్‌లో బ్యాట్స్‌మెన్ బాడీ మధ్యకి బౌలింగ్ చేయాలి. అంతేకానీ మీ బాడీ మధ్య నుంచి కాదు...

711

వాళ్లను షాట్లు ఆడనివ్వాలి. షార్ట్ బాల్స వేస్తూ, సాధ్యమైనంత సీమ్‌కి అవకాశం ఇవ్వాలి. అటాక్ చేస్తూ వికెట్లు తీయాలి అంతేకానీ పరుగులు ఇవ్వకూడదని డిఫెన్సివ్ బౌలింగ్ చేయకూడదు...

811

భారత బౌలర్లు, వాళ్ల స్కోరును తగ్గించాలనే ఉద్దేశంతో బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్‌లో ఇలాంటి బౌలింగ్ చేయడమే నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది...

911

ప్రత్యర్థి బౌలర్లు సీమ్‌ బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. వాళ్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారో, మనవాళ్లు గమనించి అలాగే బౌలింగ్ చేసి ఉంటే సరిపోయేది... 

1011

కానీ భారత బౌలర్లు అలా చేయలేదు. వాళ్లు బౌలింగ్ చేస్తుంటే మనకేం సంబంధం అన్నట్టుగా డ్రెస్సింగ్ రూమ్‌లో స్నాక్స్ తింటూ కూర్చున్నట్టు ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ...

1111

1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోజర్ బిన్నీ, ఆల్‌రౌండర్‌గా టీమిండియా తరుపున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడారు. భారత ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, రోజర్ బిన్నీ కొడుకే.

click me!

Recommended Stories