ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ అతనే... ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్...

Published : Mar 25, 2023, 01:33 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ లేకుండా బరిలో దిగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్ ప్లేస్‌లో పృథ్వీ షాకి కెప్టెన్సీ దక్కుతుందని భావించారంతా. అయితే సన్‌రైజర్స్‌కి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్...

PREV
17
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ అతనే... ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్...

ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమండియాలో చోటు కోల్పోయాడు పృథ్వీ షా. దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఇస్తున్నా, సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో పృథ్వీ షాకి చోటు దక్కుతుందని భావించినా... సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు...

27

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన జట్టులో చోటు సంపాదించుకున్న పృథ్వీ షా, ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు పృథ్వీ షా ఆశలన్నీ ఐపీఎల్ 2023 పైనే పెట్టుకున్నాడు...
 

37

‘ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం పృథ్వీ షా చాలా ముందుగానే టీమ్ క్యాంప్‌లో చేరాడు. ఎన్‌సీఏలో ట్రైయినింగ్ తీసుకుని అటు నుంచి ఇక్కడికి వచ్చాడు. తనను తాను మెరుగుపర్చుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు..
 

47

పృథ్వీ షా ఇంత ఎనర్జీగా ఉండడం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫిట్‌నెస్‌పైన కూడా చాలా ఫోకస్ పెట్టాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషమేసింది...

57

మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే పృథ్వీ షా చాలా డిఫరెంట్. అతని టాలెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. అయితే అతనితో వచ్చిన చిక్కల్లా ఒక్కటే బాగా ఆడితే నెట్స్‌‌లో గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తాడు... లేకపోతే అస్సలు చేయడు... 

67

ఇప్పుడు అతనిలో చాలా మార్పు వచ్చింది. ఓపిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మిగిలిన ప్లేయర్లతో బాగా కలిసి పోతున్నాడు. నాకు సోమరితనం అంటే అస్సలు నచ్చదు. పృథ్వీ షాలో  ఎంత టాలెంట్ ఉన్నా, బద్ధకంతో దాన్ని వేస్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది..

77
prithvi shaw

కరెక్టుగా చెప్పాలంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో పృథ్వీ షా ఉంటాడు. నా అంచనా నిజమైతే ఈసారి అతనే ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు.. ప్రతీ సెషన్‌లోనూ ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. దానికి రిజల్ట్ ఐపీఎల్‌లో కనిపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్..

click me!

Recommended Stories