బ్యాటర్‌కి బ్యాక్ పెయిన్ ఆ? శ్రేయాస్ అయ్యర్ ఏం పనులు చేస్తున్నాడో... మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 25, 2023, 12:23 PM IST

టీమిండియాలో వెన్ను నొప్పితో బాధపడుతూ క్రికెట్‌కి దూరమవుతున్న ప్లేయర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జస్ప్రిత్ బుమ్రా, దీపక్ చాహార్ పెళ్లైన తర్వాత కొన్నిరోజులకే బ్యాక్ పెయిన్‌తో క్రికెట్‌కి కొన్ని నెలల పాటు దూరమయ్యారు. ఇప్పుడు బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ కారణంతోనే టీమ్‌కి దూరమయ్యాడు...

PREV
16
బ్యాటర్‌కి బ్యాక్ పెయిన్ ఆ? శ్రేయాస్ అయ్యర్ ఏం పనులు చేస్తున్నాడో... మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు. బౌలర్లు వెన్నునొప్పితో బాధపడుతూ క్రికెట్‌కి దూరం కావడం కామన్... అయితే శ్రేయాస్ అయ్యర్ బ్యాట్స్‌మెన్...

26
Shreyas Iyer

అప్పుడప్పుడూ బౌలింగ్ వేసినా, శ్రేయాస్ అయ్యర్ వేసేది స్పిన్ బౌలింగే. స్పిన్ బౌలింగ్ వల్ల వెన్నెముకపై పెద్దగా ప్రెషర్ కూడా పడదు. మరి శ్రేయాస్ అయ్యర్ ఇలా వరుసగా గాయపడడానికి కారణాలేంటి?

36

‘కొన్ని రోజులుగా శ్రేయాస్ అయ్యర్ గాయం గురించి వార్తలు వింటున్నా. ప్రతీ ప్లేయర్‌కి గాయాలు అత్యంత సహజం. అయితే బ్యాటర్లు, వెన్నెముక గాయంతో బాధపడుతుండడమే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...

46
Image credit: PTI

ఇంతకుముందు ఎప్పుడూ కూడా బ్యాటర్లకు ఈ సమస్య ఉన్నట్టు నేను వినలేదు, చూడలేదు. ప్రతీ బ్యాటర్ కూడా వెన్నునొప్పితో బాధపడతాడా? శ్రేయాస్ అయ్యర్ ఆటకంటే ఎక్కువగా మిగిలిన పనులు ఎక్కువగా చేస్తున్నట్టు ఉన్నాడు...

56
Image credit: Getty

ప్రతీ ప్లేయర్ కూడా తాను చేసే పనుల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ పనులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్ వల్ల లాభాలు ఎన్ని ఉంటాయో, నష్టాలు కూడా అన్నే ఉంటాయి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా..

66

అహ్మదాబాద్ టెస్టు రెండో రోజు వెన్నునొప్పతో బాధపడుతూ పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్, బ్యాటింగ్‌కి రాలేదు. ఫలితంగా టీమిండియా 10 మంది బ్యాటర్లతోనే బ్యాటింగ్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక సర్జరీ చేయించుకోవాల్సిందిగా ఎన్‌సీఏ సూచించింది. అయితే అయ్యర్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు...

click me!

Recommended Stories