కరోనా పాజిటివ్ వచ్చినా తాపీగా టీ20 వరల్డ్ కప్ ఆడొచ్చు... ఐసీసీ సంచలన నిర్ణయం...

First Published Oct 16, 2022, 3:22 PM IST

రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది కరోనా వైరస్. కోవిడ్19 సోకిన కేసులతో ఆసుపత్రిలన్నీ నిండిపోయి, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్‌లు దొరక్క ఇండియాతో పాటు అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా అనేక అవస్థలు పడింది. కరోనా కారణంగా దాదాపు 8 నెలల పాటు క్రికెట్‌కి పూర్తిగా బ్రేకులు పడ్డాయి...

అన్ని దేశాల్లో కరోనా కేసులు వ్యాపించడంతో లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి సిరీస్‌లు జరగలేదు. షెడ్యూల్ ప్రకారం రెండేళ్ల క్రితం 2020లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ వాయిదాపడి ఈ ఏడాది జరుగుతోంది. ఈ సారి కరోనా బయో బబుల్ నుంచి ప్లేయర్లకు ఊరట నిచ్చింది ఐసీసీ...

Cricket, T20 World Cup

షెడ్యూల్ ప్రకారం భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 వరల్డ్ కప్ సెకండ్ వేవ్ కారణంగా యూఏఈలో జరిగింది. అక్కడ కూడా కరోనా నిబంధనల మధ్య బయో బబుల్‌లో మ్యాచులను నిర్వహించిన ఐసీసీ, స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కూడా అనేక ఆంక్షలు విధించింది...

అయితే 2022 ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే పూర్తిగా కరోనా భూతం మాత్రం తుడిచిపెట్టుకుపోలేదు. కొన్ని రోజుల క్రితం భారత క్రికెటర్ మహ్మద్ షమీ కూడా కరోనా బారిన పడి, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొనలేకపోయాడు...
 

ప్రస్తుతం అక్కడక్కడా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నా, దాన్ని ఇప్పుడు ప్రాణంతక మహమ్మారిగా పరిగణించడం మానేశారు జనాలు. దీంతో కరోనా పాజిటివ్ సోకిన ప్లేయర్లను కూడా టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

T20 World Cup 2022

రెండేళ్లుగా ప్రతీ క్రికెట్ మ్యాచ్ ఆరంభానికి ముందు తప్పనిసరిగా నిర్వహిస్తూ వస్తున్న కరోనా పరీక్షలను ఎత్తివేసిన ఐసీసీ, కోవిడ్ 19 సోకిన ప్లేయర్లు ఐసోలేషన్‌లో ఉండాలా? వద్దా? అనే నిర్ణయాన్ని డాక్టర్లకే వదిలేశారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసోలేషన్ తప్పనిసరి అవసరమని డాక్టర్లు సూచిస్తే ఆ ప్లేయర్‌ని ఐసోలేట్ చేస్తారు...

కరోనా పాజిటివ్ సోకిన ప్లేయర్లు, ఒక్కసారి నెగిటివ్‌గా తేలితే వెంటనే జట్టుతో కలిసి మ్యాచులు ఆడుకోవచ్చు. తప్పనిసరి క్వారంటైన్, ఐసోలేషన్‌లను తొలగించింది ఐసీసీ. ఇది అన్ని జట్లకు ఊరట కలిగించే విషయమే..

click me!