king kohli
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫ్యాన్స్ ‘కింగ్ కోహ్లీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పేరు ఎందుకొచ్చిందంటే దానికి ఐసీసీయే పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2019 సమయంలో కింగ్ కోహ్లీ అంటూ ఐసీసీ రూపొందించిన పోస్టర్‌పై కొందరు పాకిస్తాన్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Image Credit: Anushka Sharma Instagram
అయితే ఈ విమర్శలకు ఐసీసీ ఇచ్చిన రిప్లైలో ఫ్యాన్స్ ఫుల్లు సంతృప్తి చెందారు. 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి 2019 వరకూ విరాట్ కోహ్లీ చేసిన సెంచరీలు, హాఫ్ సెంచరీలు, పరుగులను కామెంట్ చేసిన ఐసీసీ.. అందుకే అతను కింగ్ అంటూ తేల్చి చెప్పేసింది..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 ఫోటోషూట్ సమయంలోనే విరాట్ కోహ్లీ రాజసం ఒలకబోస్తూ ఠీగా సోఫాలో కూర్చున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా... విరాట్ కోహ్లీ మేనరిజాన్ని మ్యాచ్ చేయలేకపోయాడు...
తాజాగా 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫోటో షూట్ సమయంలో రోహిత్ శర్మని ఓ మూలన కూర్చోబెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. విరాట్ కోహ్లీ కూడా సైడ్‌కే కూర్చున్నా అతని కోసం స్పెషల్ ఛైర్ వేశారు. ఇప్పుడే రోహిత్ శర్మకు ఛైర్ వేయలేదు సరికదా కూర్చోవడానికి ఓ ఐస్ బాక్స్ ఇచ్చారు...
T20 World Cup 2022
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లోనూ విరాట్‌కి వీరాభిమానులు ఉన్నారు. అందుకే విరాట్‌ని అలా ట్రీట్ చేసింది ఐసీసీ. ఇప్పుడు రోహిత్ శర్మను మాత్రం పట్టించుకోకుండా పక్కన కూర్చోబెట్టిందని వాపోతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్...
ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని అలా ట్రీట్ చేసిన ఐసీసీ, ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను ఇలా అవమానించడం సరికాదని వాపోతున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...