Published : Oct 16, 2022, 02:57 PM ISTUpdated : Oct 16, 2022, 02:58 PM IST
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు మన్కడింగ్ రనౌట్ గురించి చాలా చర్చ జరిగింది. ఇండియా, ఇంగ్లాండ్ వుమెన్స్ టీమ్స్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లీష్ ప్లేయర్ చార్లీ డీన్‌ని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో రనౌట్ చేసింది భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ. ఈ రనౌట్‌కి ముందే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, డీన్ రనౌట్‌తో ఆలౌట్ అయ్యి 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు వన్డేల్లో నెగ్గిన టీమిండియా, వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది...
సొంత గడ్డ మీద టీమిండియా చేతుల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని తట్టుకోలేకపోయిన ఇంగ్లాండ్ క్రికెటర్లు, రనౌట్ చేసిన దీప్తి శర్మ ‘క్రీడా స్ఫూర్తి’ని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఇంగ్లీష్ మీడియా కూడా భారత మహిళా జట్టు ఛీట్ చేసి గెలిచినట్టుగా వరుస కథనాలు ప్రచురించింది. ఆఖరికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20 సమయంలోనూ ‘దీప్తి శర్మ’ పేరు ప్రస్తావించి వివాదాల్లో ఇరుక్కున్నాడు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్...
26
తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు 16 జట్ల కెప్టెన్లతో కలిసి మీడియా ఈవెంట్ నిర్వహించింది ఐసీసీ. ఈ ఈవెంట్‌లో ‘మన్కడింగ్’ రనౌట్ గురించి కెప్టెన్లను ప్రశించారు ఓ మీడియా ప్రతినిథి. ‘ఐసీసీ కొత్త రూల్ నాన్- స్ట్రైయికర్ రనౌట్‌ని పొట్టి ప్రపంచ కప్‌లో అడ్వాంటేజ్‌గా వాడుకుంటారా?’ అని ప్రశ్నించాడు...
36
దీనికి కెప్టెన్లు ఎవ్వరూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, శ్రీలంక సారథి ధస్సున్ శనక, ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీతో పాటు యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్ జట్ల కెప్టెన్లు ఈ ప్రశ్నకు మౌనమే సమాధానంగా ఇచ్చారు...
46
Image credit: Getty
ఐసీసీ ఈ నాన్-స్ట్రైయికర్ రనౌట్‌కి ‘మన్కడింగ్’గా సంభోదించడం కరెక్ట్ కాదని స్పష్టం చేసినా, ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం ఇదే పదాన్ని వాడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడినా కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భావించిన ఈ కెప్టెన్లు, ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు...
56
Deepak Chahar
ఐసీసీయే స్వయంగా ఇది తప్పు కాదు అని రూల్ మార్చిన తర్వాత కూడా ‘క్రీడా స్ఫూర్తి’ గురించి చర్చ జరగడం ఏంటో అర్థం కావడం లేదని వాపోతున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఈ నాన్- స్ట్రైయికర్ రనౌట్‌ని ఏ జట్టు, ఏ ప్లేయర్‌పై అస్త్రంగా వాడుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది...
66
ఐపీఎల్ 2019 సీజన్‌లో జోస్ బట్లర్‌ని నాన్- స్ట్రైయికర్ ఎండ్‌లో అవుట్ చేసి, ‘మన్కడింగ్’కి ఈ లెవల్ పాపులారిటీ తీసుకొచ్చిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాడు. దీంతో అశ్విన్ ఈసారి నాన్ స్ట్రైయికర్ ఎండ్ రనౌట్‌ని వాడతాడా? వాడితే ఏ బ్యాటర్ ఇలా అవుట్ అవ్వబోతున్నాడనే క్యూరియాసిటీ, క్రికెట్ ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది...