గంగూలీ వల్ల ధోనీకి లక్కీ టీమ్ దొరికింది, మాహీ కంటే దాదా ఎప్పుడూ బెస్టే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...

First Published Sep 4, 2021, 3:14 PM IST

టీమిండియాకి ఆల్‌టైం బెస్ట్ కెప్టెన్ ఎవరంటే, చాలామంది చెప్పే సమాధానం మహేంద్ర సింగ్ ధోనీ. రెండు వరల్డ్‌కప్, మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచిన ధోనీ కంటే, వీరేంద్ర సెహ్వాగ్ బెస్ట్ అండ్ బెటర్ కెప్టెన్ అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 ఐసీసీ వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా, 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది భారత జట్టు... 

‘నా ఉద్దేశంతో కెప్టెన్సీ విషయంలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ గ్రేటే... అయితే ధోనీ కంటే గంగూలీ ది బెస్ట్. ఎందుకంటే గంగూలీ, ఎంతో కష్టపడి జట్టును నిర్మించాడు...

కొత్త ప్లేయర్లను తీసుకొచ్చి, సత్తా ఉన్న ఆటగాళ్లను గుర్తించి మరీ ఓ బలమైన జట్టును మార్చాడు. విదేశాల్లో కూడా భారత జట్టు గెలవగలదని ప్రపంచానికి చాటా చెప్పాడు...

గంగూలీ కెప్టెన్సీలో మేం విదేశాల్లో విజయాలు అందుకున్నాం... గంగూలీ కష్టపడి, ఒక్కో ప్లేయర్‌ను చేర్చుతూ నిర్మించిన జట్టు దొరకడం మహేంద్ర సింగ్ ధోనీ అదృష్టం....

దాదా నిర్మించిన జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు, బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు. వారిని జట్టును నడిపించి, విజయాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నా ఉద్దేశం... అందుకే మాహీ కంటే దాదా బెస్ట్ కెప్టెన్...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్త చేసుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ‘ఇది చాలా పాత విషయం. 2008లో శ్రీలంక టూర్‌కి వెళ్లాం.. ముత్తయ్య మురళీధరన బౌలింగ్ చేస్తున్నాడు. ఇషాంత్ శర్మ నాన్ స్ట్రైయిటింగ్ ఎండ్‌లో ఉన్నాడు...

అప్పుడు నా స్కోరు 198. నేను సింగిల్ తీసుకుంటే, మురళీధరన్... ఇషాంత్ శర్మను ఈజీగా అవుట్ చేస్తాడని తెలుసు. ఆఖరి బంతికి సింగిల్ రాకూడదని ఫీల్డర్లను దగ్గరగా పెట్టాడు... అయినా గ్యాప్ రాబట్టి నేను సింగిల్ తీశాను...

అయితే ఇషాంత్ శర్మ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీ చేయలేకపోయా... నాకు మొహాలీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అక్కడ ఆడడం చాలా ఇష్టపడతాను..

అక్కడ ఎప్పుడు ఆడినా, కచ్ఛితంగా బెటర్ పర్ఫామెన్స్ ఇస్తాననే నమ్మకం. అక్కడ పెద్ద సోఫాలు ఉంటాయి. అవుటైన తర్వాత వచ్చి వాటి మీద కూర్చొని రిలాక్స్ అయ్యేవాడిని...

ఇండియా బయట నాకు మెల్‌బోర్న్ అంటే ఇష్టం. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడ కూడా నాకు నా సొంత గ్రౌండ్ అనే ఫీలింగ్ దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

click me!