సెహ్వాగ్‌ని అవుట్ చేయడం చాలా ఈజీ! పాక్‌లో అయితే అతను టీమ్‌కి ఆడేవాడే కూడా కాదు... - పాక్ మాజీ క్రికెటర్

Published : Jul 17, 2023, 11:37 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగక 10 ఏళ్లు దాటడం, 7 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, ఇండియాలో అడుగుపెట్టబోతుండడంతో ఈ మ్యాచ్‌పై హైప్ ఆకాశాన్ని తాకుతోంది..

PREV
17
సెహ్వాగ్‌ని అవుట్ చేయడం చాలా ఈజీ! పాక్‌లో అయితే అతను టీమ్‌కి ఆడేవాడే కూడా కాదు... - పాక్ మాజీ క్రికెటర్

పాకిస్తాన్ తరుపున 9 టెస్టులు, 74 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడిన మాజీ ఫాస్ట్ బౌలర్ రాణా నవీద్ ఉల్ హసన్, మొత్తంగా 141 వికెట్లు తీశాడు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు భారత మాజీ క్రికెటర్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రాణా నవీద్...

27

‘2004-05 సిరీస్‌లో జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. సెహ్వాగ్ 85 పరుగులతో ఆడుతున్నాడు. ఆ సిరీస్‌లో నేను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచాను. అప్పటికే రెండు మ్యాచులు గెలిచి 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నాం...

37

మూడో మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అప్పటికే టీమిండియా 300 దాకా వచ్చేసింది. సెహ్వాగ్ 85 పరుగుల దగ్గర ఉన్నాడు. ఇంజీ భాయ్ (ఇంజమామ్ వుల్ హక్) దగ్గరికి వెళ్లి, నాకు బౌలింగ్ ఇస్తే, సెహ్వాగ్‌ని అవుట్ చేస్తానని చెప్పా..

47

నేను స్లో బౌన్సర్ వేశా. అతని దగ్గరికి వెళ్లి ‘‘నీకు నా బౌలింగ్‌లో ఎలా ఆడాలో రాదు. నువ్వు పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే, నీకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు.. ’’ అన్నాను. అతను దానికి ఏదేదో చెప్పాడు..
 

57
Virender Sehwag

నేను, ఇంజీ భాయ్ వైపు తిరిగి, ‘‘నెక్ట్స్ బాల్‌కి ఇతన్ని అవుట్ చేస్తా’ అని చెప్పా. అతను షాక్ అయ్యాడు. అన్నట్టుగానే స్లో బాల్ వేశా. అతను భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సెహ్వాగ్ అవుట్ కావడంతో మేం ఆ మ్యాచ్‌లో ఈజీగా గెలిచాం. 

67

ఫాస్ట్ బౌలర్‌కి ఇలాంటి ట్రిక్స్ ఉండాలి. సెహ్వాగ్ అవుట్ చేయడం చాలా తేలిక. అతన్ని కాస్త కదిలిస్తే చాలు, ఆవేశంతో తన వికెట్ పారేసుకుంటాడు. రాహుల్ ద్రావిడ్ వికెట్ తీయడం చాలా కష్టం. అతను ఏం చేసినా ఏకాక్రత కోల్పోడు. తన ఫోకస్ ఆ రేంజ్‌లో ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు రాణా నవీద్ ఉల్ హక్...

77

అయితే అతను చెప్పినట్టుగా వీరేంద్ర సెహ్వాగ్ వికెట్‌ని నవీద్ ఉల్ హక్ తీసినా... ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 58 పరుగుల తేడాతో ఓడింది. మొదటి రెండు మ్యాచుల్లో నెగ్గిన టీమిండియా, మూడో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసర మార్పులు, ప్రయోగాలు చేసి పాక్ చేతుల్లో ఓడింది..

click me!

Recommended Stories