ఇండియా లేకపోతే పాకిస్తాన్ లేదు! మనమంతా ఒక్కటే... షాదబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్...

Published : Jul 15, 2023, 04:19 PM IST

అఖండ భారతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భాగమే. అయితే బ్రిటీష్ పాలన తర్వాత దేశం రెండు భాగాలుగా విడిపోయింది. అయితే దేశవిభజన తర్వాత కొన్నాళ్లు స్నేహంగా మెలిగిన రెండు దేశాలు, ఇప్పుడు బద్ధశత్రువులుగా మారిపోయాయి.  ఇంతకుముందు ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా మినీ వార్‌ని తలపించేవి..

PREV
16
ఇండియా లేకపోతే పాకిస్తాన్ లేదు! మనమంతా ఒక్కటే... షాదబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియాని, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని చులకన చేసి మాట్లాడడం పాక్ క్రికెటర్లకు బాగా అలవాటు. అయితే మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్న పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్ మాత్రం భారత ప్లేయర్ల గురించి, ఇండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు..

26

టీమిండియా క్రికెటర్లు తజిందర్ సింగ్, చైతన్య భిష్ణోయ్‌‌లతో కలిసి శాన్ ఫ్రాన్సికో యూనికార్న్స్‌ టీమ్‌కి ఆడుతున్నాడు షాదబ్ ఖాన్. దేశవాళీ టోర్నీల్లో ఆడి, భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఇద్దరూ... బీసీసీఐకి రిటైర్మెంట్ ఇచ్చి మేజర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొంటున్నారు..

36

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో సీఎస్‌కే టీమ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ తరుపున ఆడాల్సింది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు..

46
Shadab Khan

పేరుకి అమెరికాలో జరుగుతున్న లీగ్ అయినా ఇందులో టీమ్స్ అన్నీ కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్‌... మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫ్రాంఛైజీలను దక్కించుకున్నాయి..  దీంతో పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్, చాలా ఆచితూచి మాట్లాడాడు..
 

56

‘ఇండియా లేకపోతే పాకిస్తాన్ లేదు. 1947కి ముందు మనమంతా ఒక్కటే కదా. భారత సోదరులతో కలిసి ట్రైయినింగ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి ఇదే అద్భుతమైన అవకాశం..

66
Shadab Khan

మన భాషలు, సంస్కృతి ఒక్కటే. పంజాబీలో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. హిందీలో టీమిండియా ప్లేయర్లతో మాట్లాడుతుంటే అన్నాదమ్ములతో ఉన్నట్టే ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ క్రికెటర్ షాదబ్ ఖాన్.. త

click me!

Recommended Stories