సీఎస్‌కేపై కోహ్లీ, ఆర్‌సీబీపై ధోనీ, కేకేఆర్‌పై రోహిత్ శర్మ... ఏ జట్టుపై ఎవరెన్ని పరుగులు చేశారంటే...

First Published Sep 13, 2021, 3:52 PM IST

ఒక్కో ప్లేయర్‌పై ఒక్కో ప్రత్యర్థిపై ఆడడం చాలా సులువుగా ఉంటుంది. ఐపీఎల్‌లోనూ ఇలాగే స్టార్ క్రికెటర్లకి కొన్ని ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. ఐపీఎల్‌ కెరీర్‌లో ఏ జట్టుపై ఎవరెన్ని పరుగులు చేశారంటే...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్‌సీబీపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సొంతం చేసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ... మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ఎమ్మెస్ ధోనీ, ఆర్‌సీబీపై 825 పరుగులు చేసి, టాప్‌లో ఉన్నాడు...

ఢిల్లీ క్యాపిటల్స్: ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా 2020 సీజన్‌లోనే ఫైనల్ చేరింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 909 పరుగులు చేశాడు...

చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ కెరీర్‌లో మూడు టైటిల్స్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో సీఎస్‌కేపై అత్యధికంగా  895 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...

పంజాబ్ కింగ్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి పంజాబ్ జట్టు అంటే మహా ప్రీతి. ఐపీఎల్ కెరీర్‌లో పంజాబ్‌పైన రికార్డు స్థాయిలో 943 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్ భాయ్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టుపై రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. కేకేఆర్‌పై రికార్డు స్థాయిలో 983 పరుగులు చేశాడు రోహిత్. మరో 17 పరుగులు చేస్తే, ఒకే జట్టుపై 1000 పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు ‘హిట్ మ్యాన్’...

ముంబై ఇండియన్స్: ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యధికంగా ఐదు టైటిల్స్ గెలిచింది ముంబై ఇండియన్స్. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లతో నిండిన ముంబైపై అత్యధికంగా 820 పరుగులు చేశాడు ‘చిన్నతలా’ సురేశ్ రైనా...

రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధికంగా 648 పరుగులు చేశాడు ‘మిస్టర్ 360’, ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్: 2013లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అత్యధికంగా 566 పరుగులు చేశాడు సీఎస్‌కే మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్... 

మొత్తంగా ప్రస్తుతం ఉన్న 8 జట్లపై అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆర్‌సీబీ ప్లేయర్లు (విరాట్ కోహ్లీ రెండు టీమ్‌లపై, ఏబీడీ) ముగ్గురు ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ (సురేశ్ రైనా, ఎమ్మెస్ ధోనీ, షేన్ వాట్సన్) ప్లేయర్లు కూడా ముగ్గురు ఉన్నారు... ముంబై ఇండియన్స్ (రోహిత్), సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్కో ప్లేయర్ ఉన్నారు.

click me!