అవన్నీ తప్పుడు వార్తలే... టీ20 వరల్డ్‌కప్‌లో ఓడినా విరాట్ కోహ్లీయే కెప్టెన్... బీసీసీఐ క్లారిటీ...

First Published Sep 13, 2021, 2:06 PM IST

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ తేల్చి చెప్పేసింది...

భారత సారథి విరాట్ కోహ్లీ, టీమిండియాకే కాదు వరల్డ్‌ టెస్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడు. టీ20, వన్డేల్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజీలాండ్ చేతుల్లో ఓడింది...

ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా 8 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ... 

అదే టైంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ అందుకున్నాడు. ఇదే విరాట్‌ కోహ్లీకి ఇబ్బందులు తీసుకొచ్చింది...

టీ20, వన్డేల్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకి అప్పగించాలని దాదాపు రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...

రెండేళ్లుగా బ్యాటుతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగినా, వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని రోహిత్‌కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడని ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది...

అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ... విరాట్ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్ అని వార్తలు కూడా వచ్చాయి....

ఇప్పటికే రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఈ విషయం గురించి చర్చించిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫలితం ఏదైనా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడని అన్నారు...

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఫెయిల్ అయినా విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా కొనసాగుతాడని తేల్చి చెప్పాడు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్...

‘విరాట్ కోహ్లీ టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగలేదు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా రిజల్ట్ ఎలా వచ్చినా, మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా కొనసాగుతాడు...’ అంటూ తెలిపాడు అరుణ్ ధుమాల్..

click me!