ఇండియా- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్... పీసీబీ ఆఫర్‌ని తిరస్కరించిన బీసీసీఐ, మీతో ఆడేది లేదంటూ...

Published : May 18, 2023, 03:06 PM IST

ఐపీఎల్ 2008 సీజన్‌లో పాక్ ప్లేయర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇండియా, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీసు‌లు పూర్తిగా రద్దయ్యాయి, పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీ కూడా లేకుండా పోయింది...  

PREV
15
ఇండియా- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్... పీసీబీ ఆఫర్‌ని తిరస్కరించిన బీసీసీఐ, మీతో ఆడేది లేదంటూ...

2012లో చివరిగా ఇండియాలో పర్యటించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు, రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. 2007 నుంచి ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ జరగడమే లేదు...
 

25

అయితే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి రచ్చ జరుగుతున్న సమయంలో ఇండియా- పాకిస్తాన్ మధ్య తటస్థ వేదికపై టెస్టు సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ, బీసీసీఐకి ఆఫర్ ఇచ్చాడు...

35

‘ఇండియా - పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే సుదీర్ఘ ఫార్మాట్‌కి మళ్లీ క్రేజ్ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచులు ఆడితే బాగుంటుంది. ఇంగ్లాండ్‌లో బెటర్, ఆ తర్వాత ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్టేడియాలు, ఇండియా- పాక్ ఫ్యాన్స్‌తో నిండిపోతాయి...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ.

45

అయితే పాక్ ఆఫర్‌ని బీసీసీఐ తిరస్కరించింది. ‘పాకిస్తాన్‌తో రాబోయే రోజుల్లో టెస్టు సిరీస్ ఆడే ఆలోచన కూడా మాకు లేదు. ఆ మాటకు వస్తే ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు కూడా టీమిండియా సిద్ధంగా లేదు...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి మీడియాకి తెలియచేశాడు...
 

55

ఆసియా కప్ 2023 టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహించాలని గట్టిగా ప్రయత్నించింది పీసీబీ. అయితే బీసీసీఐ, పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించడంతో తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. 

click me!

Recommended Stories