కొత్తేముంంది? వచ్చే సీజన్‌లో మరో కొత్త కెప్టెన్, మరో కొత్త టీమ్... పంజాబ్ కింగ్స్‌ ఫెయిల్యూర్‌కి...

Published : May 18, 2023, 12:05 PM IST

ఐపీఎల్ మొదలై 16 సీజన్లుగా గడుస్తున్నా టైటిల్ గెలవని టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్ ఒకటి. 16 సీజన్లలో ఒకే ఒక్కసారి ఫైనల్ ఆడిన టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి... ఢిల్లీ ఈ సీజన్‌ వదిలేస్తే గత 4 సీజన్లలో బాగానే ఆడింది, పంజాబ్ కథ మాత్రం మారడం లేదు...

PREV
110
కొత్తేముంంది? వచ్చే సీజన్‌లో మరో కొత్త కెప్టెన్, మరో కొత్త టీమ్... పంజాబ్ కింగ్స్‌ ఫెయిల్యూర్‌కి...
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌ని భారీ అంచనాలతో మొదలెట్టింది పంజాబ్ కింగ్స్. 2022 తర్వాత సగం టీమ్‌ని వేలానికి వదిలేసిన పంజాబ్ కింగ్స్, 2023 మినీ వేలంలో సామ్ కుర్రాన్‌ని రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది...
 

210
PTI Photo/Kamal Kishore)(PTI04_15_2023_000333B)

జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజాని రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, హర్‌ప్రీత్ భాటియా, మోహిత్ రతే, మాథ్యూ షార్ట్, గుర్నూర్ సింగ్ బ్రార్ వంటి ప్లేయర్లను బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది..
 

310
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000255B)

ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్‌కి రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే, ఆ తర్వాతి సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్ అయ్యాడు. 2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా చేస్తే, 2023 సీజన్‌లో ఆ బాధ్యతలు శిఖర్ ధావన్‌కి దక్కాయి..

410
Image credit: PTI

ప్రస్తుతం 13 మ్యాచుల్లో 6 విజయాలతో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్స్‌కి చేరడం దాదాపు అసాధ్యమే. ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం అందుకుని, పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ పెరిగినా 14 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్‌తో ఆర్‌సీబీ, కేకేఆర్ నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది..

510
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000356B)

2014లో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, అప్పుడెప్పుడో 2008లో సెమీ ఫైనల్స్ ఆడింది. ఆ తర్వాత ఏ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేదు. వరుసగా గత 4 సీజన్లలో ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్‌కి ఈసారి ఆ పొజిషన్ కూడా దక్కేలా కనిపించడం లేదు...

610

సికందర్ రజా బాగా ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన తర్వాత అతనికి తర్వాతి మ్యాచ్‌లో చోటు ఉండడం లేదు. 2023 సీజన్ ఆరంభంలో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న అర్ష్‌దీప్ సింగ్, సెకండాఫ్‌లో పవర్ ప్లేలో కానీ, డెత్ ఓవర్లలో కానీ బౌలింగ్‌కి రావడం లేదు...

710

అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడా వంటి బౌలర్లను ఎలా వాడాలో పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తెలియడం లేదు. అందుకే భారీ స్కోరు చేస్తున్నా, దాన్ని కాపాడుకోవడంలో మాత్రం పంజాబ్ ఫెయిల్ అవుతూ వస్తోంది...
 

810
PTI Photo) (PTI04_05_2023_000367B)

పంజాబ్ కింగ్స్‌లో మ్యాచ్ విన్నర్లు పుషల్కంగా ఉన్నారు. అయితే వారిని ఎలా వాడుకోవాలో మాత్రం మేనేజ్‌మెంట్‌కీ, సపోర్టింగ్ స్టాఫ్‌కి తెలియడం లేదు. ఈ సీజన్ ఫెయిల్యూర్‌తో 2024 సీజన్‌లో మరో కొత్త కెప్టెన్‌తో వస్తుంది
పంజాబ్ కింగ్స్...

910

శిఖర్ ధావన్‌ని తప్పించి, సామ్ కుర్రాన్‌కి లేదా లియామ్ లివింగ్‌స్టోన్‌కి కానీ కెప్టెన్సీ ఇవ్వొచ్చు. అవసరమైతే మళ్లీ ఓ సారీ జెర్సీని, టీమ్ పేరుని, లోగోని మార్చాలని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అండ్ కో అనుకోవచ్చు...

1010
PTI Photo/Kamal Kishore)(PTI04_01_2023_000164B)

అంతేకానీ టీమ్‌లో ఎక్కడ తప్పు జరుగుతోంది? ఎందుకని స్టార్ ప్లేయర్లు ఉన్నా సక్సెస్ రావడం లేదనే ఆలోచన కానీ, టైటిల్ గెలవాలంటే ఏం చేయాలనే ముందుచూపు కానీ పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో కనిపించడం లేదు. అందుకే అది ఐపీఎల్ చరిత్రలో ఓ చిన్న టీమ్‌గా, ఫెయిల్యూర్ టీమ్‌గా మిగిలిపోతోంది..

click me!

Recommended Stories