టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు నుంచే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగాల్సి ఉంది...
పాకిస్తాన్‌లో జరిగితే ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా ఆడదని, తటస్థ వేదికపై టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా తీవ్రంగా స్పందించాడు...
27
టీమిండియా, ఆసియా కప్ 2023 టోర్నీ ఆడడానికి పాకిస్తాన్‌కి రాకపోతే... తాము వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడబోమని వ్యాఖ్యానించాడు రమీజ్ రాజా. అంతేకాకుండా ఆసియా కప్ తటస్థ వేదికపై నిర్వహిస్తే, అందులో కూడా పాల్గొనబోమని స్ఫష్టం చేశాడు...
37
Najam Sethi
ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో పాకిస్తాన్, పీసీబీ అధ్యక్ష పదవి నుంచి రమీజ్ రాజాని తొలగించింది. రమీజ్ రాజా స్థానంలో బాధ్యతలు తీసుకున్న పీసీబీ కొత్త ఛైర్మెన్ నజీం సేథీ మాత్రం దీనిపై భిన్నంగా స్పందించాడు..
47
najam sethi
‘ఒకవేళ ప్రభుత్వం, ఇండియాకి వెళ్లవద్దని చెబితే... వెళ్లం! వెళ్లాల్సిందేనని సూచిస్తే, వెళ్తాం, వన్డే వరల్డ్ కప్ ఆడతాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే...
57
ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ ఆడాలా? వద్దా? ఇండియా, పాక్‌కి రావాలన్ని, మేం అక్కడికి వెళ్లాలన్నా ఇరుదేశాల ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాన్ని కాదని, క్రికెట్ ఆడడానికి లేదు.. ఈ విషయాలు బోర్డులు డిసైడ్ చేయలేదు. పీసీబీ విషయంలోనూ అంతే...
67
India vs Pakistan
ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌లో టోర్నీ నిర్వహించడం వీలుకాదనుకంటే... తటస్థ వేదికపై ఆసియా కప్ ఆడడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి వదిలేయడమే ఉత్తమం...
77
2018లో నేను పీసీబీ ఛైర్మెన్ అయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడింది. నన్ను ఎవ్వరూ తొలగించలేదు, నేను స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి పీసీబీకి సరైన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంచుకునే అధికారం ఉందని నేను నమ్ముతాను...’ అంటూ కామెంట్ చేశాడు నజీం సేథీ.