ఇండియాని రెండు సార్లు ఓడించాం, పాక్ తోపు టీమ్‌ అని తెలిసేలా చేశాం! - పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

First Published Dec 27, 2022, 11:44 AM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో ఉన్నన్ని రోజులు నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు రమీజ్ రాజా. ఆ నోటి దురుసు వల్లే పీసీబీ అధ్యక్ష పదవి నుంచి రమీజ్ రాజాని తొలగించింది పాకిస్తాన్. రమీజ్ రాజాకి అండగా నిలిచిన సెలక్టర్లపై కూడా వేటు వేసింది...

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన రమీజ్ రాజా, తిరిగి కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నాడు. దానికంటే ముందు తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరిగి సోది చెప్పడం మొదలెట్టేశాడు. పీసీబీ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తప్పుకున్నాక చేసిన తొలి వీడియోలోనూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రమీజ్ రాజా...
 

‘భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. భారత్‌లో క్రికెట్‌ని అమితంగా ప్రేమిస్తారు. క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. వారికి క్రికెట్‌పై ఉన్న ప్రేమకు సరిహద్దులు లేవు. ఓ క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా కూడా భారత్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ లభించింది..

అయితే పాకిస్తాన్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరిన తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే నేను తీసుకున్న చాలా నిర్ణయాలు, భారత ఫ్యాన్స్‌కి నచ్చలేదు. పాక్ బోర్డు సొంత ప్రయోజనాల కోసమే చూస్తుంది. మా దేశానికి, మా దేశ క్రికెట్‌కి ఏది అవసరమో అదే చేస్తాం...

ఆసియా కప్ నిర్వహించడానికి ఆతిథ్య హక్కులు పొందడంతోనే సమస్య మొదలైంది. భారత జట్టు, పాక్‌కి వెళ్లమని చెప్పింది. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తామని చెప్పింది. అదే జరిగితే ఇకపై ఏ పెద్ద జట్టూ పాక్‌కి రావడానికి ఇష్టపడదు. అందుకే పాక్‌లోనే నిర్వహించాలని పట్టుబట్టాను.. 

India vs Pakistan

అయితే పాకిస్తాన్ ఏం చేయగలదో టీమిండియాకి బాగా అర్థమైంది. వారిని ఒకటికి రెండు సార్లు ఓడించాం. క్రికెట్‌లో మేం కూడా సూపర్ పవర్స్‌ టీమ్‌ అని నిరూపించుకున్నాం.. ఇంత రాద్ధాంతం లేకుండా ఆసియా కప్ ఆతిథ్య హక్కులను వదులుకోవచ్చు... కానీ అది వాళ్ల ఆధిపత్యాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది...

పాక్‌పై టీమిండియా ఆధిక్యం చెలాయించాలని చూసింది. దానికి నేను ఎదురుతిరిగాను. ఇండియాపై గెలవడం ఎంత అవసరమో, బాబర్ ఆజమ్‌కి చెబుతూ వచ్చాను. ఎలాగైతేనేం వాళ్లని రెండు సార్లు ఓడించి, సత్తా నిరూపించుకున్నాం..  ’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
 

click me!