టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడంపై శార్దూల్ ఠాకూర్‌ అసంతృప్తి... రాజకీయాల వల్లే రిజర్వు బెంచ్‌కే..

Published : Dec 26, 2022, 05:31 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. మహ్మద్ షమీ గాయపడడంతో అతని ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్‌ని రెండో టెస్టులో ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్, శార్దూల్ ఠాకూర్‌ని మాత్రం పక్కనబెట్టేసింది...

PREV
17
టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడంపై శార్దూల్ ఠాకూర్‌ అసంతృప్తి... రాజకీయాల వల్లే రిజర్వు బెంచ్‌కే..
Image credit: Getty

2010లో సౌతాఫ్రికాపై అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయలేక... జట్టులో చోటు కోల్పోయాడు. 12 ఏళ్ల తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు జయ్‌దేవ్ ఉనద్కట్...
 

27

ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కథ కూడా దాదాపు ఇలాంటిదే. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు శార్దూల్ ఠాకూర్. అయితే ఆ మ్యాచ్‌లో సరిగ్గా ఐదు బంతులు వేసిన శార్దూల్, వెన్నునొప్పితో బాధపడుతూ మైదానం వీడాడు...

37
Shardul Thakur - Virat Kohli

మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్. ఆ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్, బౌలింగ్‌లోనూ అదరగొట్టి టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకున్నాడు...

47

టీమిండియాకి టెస్టుల్లో లక్కీ ప్లేయర్‌గా మారిన శార్దూల్ ఠాకూర్, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగిన భారత్, రెండో టెస్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగింది...

57

తొలి టెస్టులో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌ని తప్పించి, జయ్‌దేవ్ ఉనద్కట్‌ని టీమ్‌లోకి తెచ్చిన భారత జట్టు, శార్దూల్ ఠాకూర్‌ని పట్టించుకోలేదు. దీనిపై శార్దూల్ ఠాకూర్ అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది. ట్విట్టర్‌లో శార్దూల్ ఠాకూర్ లైక్ చేసిన రెండు ట్వీట్లు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది...

67

‘రిజర్వు బెంచ్‌లో ఇలా కూర్చొని కంటే వెళ్లి రంజీ మ్యాచులు ఆడుకోవడం బెటర్ బ్రదర్.. కనీసం అక్కడైనా నీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. రాజకీయాలు చేయరు. నువ్వు త్వరలోనే కమ్‌బ్యాక్ ఇస్తావని అనుకుంటున్నా...’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని లైక్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

77
Shardul Thakur

అలాగే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్నట్టు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని కాదని, జయ్‌దేవ్ ఉనద్కట్‌ని టీమ్‌లోకి ఎలా తీసుకొస్తారు... అంటూ మరో నెటిజన్ చేసిన ట్వీట్‌ని కూడా లైక్ కొట్టాడు శార్దూల్ ఠాకూర్. దీంతో తనని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడానికి రాజకీయాలే కారణమని శార్దూల్ ఠాకూర్ భావిస్తున్నట్టు ఉందని అర్థమవుతోంది.

click me!

Recommended Stories