MS Dhoni : రాంచీకి వెళ్తా, బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తా.. IPL 2025 తర్వాత ధోని ప్లాన్ ఏంటో తెలుసా?

Published : May 26, 2025, 01:32 AM IST

MS Dhoni : ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ అనంతరం ధోనీ తన భవిష్యత్‌పై స్పష్టత ఇచ్చాడు. ఫిట్‌నెస్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. 

PREV
15
ఆసక్తిని పెంచిన ఎంఎస్ ధోని కామెంట్స్

MS Dhoni: ఐపీఎల్ 2025 తమ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గుజరాత్ టైటాన్స్ (GT) పై 83 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో సీజన్‌ను ముగించిన సీఎస్కే జట్టు, తమ అభిమానులకు జాయ్ ఫుల్ వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కూల్ ఎం.ఎస్. ధోనీ చేసిన కామెంట్స్ అందరిలో ఆసక్తిని రేపాయి.

25
రెండవ ఇన్నింగ్స్‌లో విఫలమైన గుజరాత్

చెన్నై బ్యాట్స్‌మెన్ మంచి ప్రదర్శన చేసి భారీ స్కోర్ సాధించారు. డెవాల్డ్ బ్రెవిస్, డేవాన్ కాన్వే హాఫ్ సెంచరీలు కొట్టగా, ఉర్విల్ పటేల్ (34 పరుగులు), ఆయుష్ మ్హాత్రే (37 పరుగులు)లు జట్టుకోసం మంచి ఇన్నింగ్స్ లను ఆడారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 230 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగంలో నూర్, కంబోజ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. జడేజాకు రెండు వికెట్లు తీసకున్నారు. సీఎస్కే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ జట్టు 147 పరుగులకే ఆలౌట్ అయింది.

35
ధోనీ భవిష్యత్‌పై క్లారిటీ

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. “ఇది మంచి మ్యాచ్. మా సీజన్ బాగా సాగలేదు, కానీ ఇది మంచి ప్రదర్శనల్లో ఒకటి” అని అన్నారు. ఇక తాను తదుపరి సీజన్‌లో ఆడతానా అనే ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. “ఇది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం తీసుకునేందుకు నాకు నాలుగైదు నెలల సమయం ఉంది. ఏం తొందర లేదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి” అన్నారు.

45
IPL రిటైర్మెంట్‌పై ధోనీ అభిప్రాయమేంటి?

తన IPL రిటైర్మెంట్‌పై ధోనీ మాట్లాడుతూ.. “ప్రదర్శనతో కాదు, ఫిట్‌నెస్‌తోనే నేను నిర్ణయం తీసుకుంటా. ఆటగాళ్లు ప్రదర్శనకే రిటైర్ అవుతూ ఉంటే, కొందరు 22 ఏళ్లకే రిటైర్ అయిపోతారు. నేను రాంచీకి వెళ్తాను. బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తాను. నేను ఇంకా ఫైనల్ గా ఏమీ చెప్పలేను.. వస్తానా, రానా అని కాదు. నాకు సమయం ఉంది, ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాను” అని అన్నారు.

55
చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్‌పై సూచనలు

సీజన్ ప్రారంభంలో చెన్నైలో నాలుగు మ్యాచ్‌లు జరిగాయని గుర్తు చేసిన ధోనీ, మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం మేలు అని భావించినట్లు చెప్పారు. “మేము స్కోర్ బోర్డు మీద పరుగులు చేస్తాం.. కానీ, ఇందులో కొంత మెరుగైన ప్రదర్శనలు ఉండాలి. ఇందులో కొంత లోపం ఉంది. రుతురాజ్‌ ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అని సూచించారు. కాగా, ధోనీ భవిష్యత్‌పై ఇప్పటికి స్పష్టత ఇచ్చినా, అభిమానులు  ఆయన రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories