Indian Premier League 2025 : ప్యాట్ కమిన్స్... గత ఐపిఎల్ నుండి తెలుగు క్రికెట్ ప్రియులకు బాగా దగ్గరైన ఆటగాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అద్భుతాలు చేస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది.
ప్యాట్ కమిన్స్ : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చింది ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనే చెప్పాలి. అంతకుముందు బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ వీక్ గా ... బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ లో వీక్ గా ఉండేది సన్ రైజర్స్... కానీ కమిన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఆర్‌హెచ్ టీం సమతూకంగా కనిపిస్తోంది. ఇక కమిన్స్ కెప్టెన్ గా చాలా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు.
గత ఐపిఎల్ సీజన్ లో కమిన్స్ కెప్టెన్సీకి వందకు వంద మార్కులు పడ్డాయి. బాల్ తోనే కాదు బ్యాట్ తోనూ అద్భుతాలు చేసే సామర్థ్యం కమిన్స్ సొంతం. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ టీం ను చాలాసార్లు గెలిపించాడు. ఇక కెప్టెన్ గా మైదానంలో వ్యూహాలు రచించడంలో అతడికి అతడే సాటి. అతడి వ్యూహాలే సన్ రైజర్స్ ను విజయాల బాట పట్టించింది.
కమిన్స్ బంతితో మ్యాజిక్ చేయగలడు... ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ను బోల్తాకొట్టించి వికెట్లు పడగొట్టడంలో దిట్ట. అతడి బంతిని చేతిలోకి తీసుకున్నాడంటే వికెట్ పడాల్సిందే. హేమాహేమీ బ్యాట్ మెన్స్ ను కూడా అద్భుతమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టగలడు సమర్ధుడు. కమిన్స్ రాకతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం బలంగా మారింది. గతంలో టీం వీక్ నెస్ గా ఉన్న బౌలింగ్ ఇప్పుడు కమిన్స్ సారథ్యంలో బలంగా మారింది.
23
Indian Premier League 2025
ఈసారి కప్ మనదేనంటున్న కాచిగూడ కమిన్స్...
కమిన్స్ ఐపిఎల్ ద్వారా తెలుగు ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. అతడు తమ జట్టుకు అందిస్తున్న విజయాలు చూసి తెలుగోళ్లు ఉప్పొంగిపోతున్నారు. అందుకే అతడిని తమవాడిని చేసుకుంటూ 'కాచిగూడ, కర్మన్ ఘాట్, చింతల్ బస్తీ కమిన్స్' అంటూ ముద్దుపేర్లు పెట్టుకున్నారు.
కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఐపిఎల్ జట్లన్నింటి కంటే బలంగా కనిపిస్తోంది. అతడు ఆటగాడిగా ఫ్రూఫ్ చేసుకున్నాడు.... ఇక కెప్టెన్ గా మరో మెట్టు ఎక్కేసాడు. ఆస్ట్రేలియన్ కెప్టెన్సీ సన్ రైజర్స్ కు కలిసివస్తుందని కమిన్స్ మరోసారి నిరూపిస్తున్నాడు. ఈసారి కప్ మనదే అనే ధీమాతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉండటానికి కమిన్స్ ప్రధాన కారణమని చెప్పవచ్చు.
33
Cummins
కమిన్స్ ఐపిఎల్ కెరీర్ :
ఆస్ట్రేలియా క్రికెటర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్లుగా బాగా రాణిస్తున్నారు. గతంలో గిల్ క్రిస్ట్, వార్నర్ లు ఈ జట్టును ముందుండి నడపగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఆ పని చేస్తున్నాడు. కమిన్స్ 2014 లో ఐపిఎల్ లో ఆరంగేట్రం చేసాడు... ఇప్పటివరకు అతడు 59 మ్యాచులాడి 63 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ గానే కాదు బ్యాట్ మెన్ గా కూడా మంచిపరుగులే సాధించాడు. ఐపిఎల్ లో 3 హాఫ్ సెంచరీలతో 515 పరుగులు చేసాడు... హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోరు 66 నాటౌట్.
బౌలింగ్ విషయానికి వస్తే గత ఐపిఎల్ 2024 లో 16 మ్యాచులాడిన కమిన్స్ 18 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు కూడా 2020 లో 12, 2017 లొ 15 వికెట్లు తీసాడు. ఇలా ఐపిఎల్ లో ఇప్పటివరకు 63 వికెట్లు పడగొట్టాడు. అతడి బెస్ట్ 4/34... ఐపిఎల్ 2020 లో నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా జట్టుకు సారథ్యం వహించడమే కాదు బౌలింగ్ విభాగాన్ని కూడా ముందుండి నడిపిస్తున్నాడు.