సారీ నేను రాలేను... ఐపీఎల్ 2021 సీజన్‌‌పై తేల్చి చెప్పేసిన ప్యాట్ కమ్మిన్స్... కారణం ఇదే...

First Published May 31, 2021, 10:44 AM IST

ప్యాట్ కమ్మిన్స్... ఈ ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తన పర్ఫామెన్స్‌తో పాటు కమ్మిన్స్ వ్యక్తిత్వం కూడా దీనికి కారణం. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ తరుపున అద్భుతంగా రాణించిన ప్యాట్ కమ్మిన్స్, మిగిలిన సీజన్‌కి రావడం లేదని ప్రకటించాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం భారత్‌కి వచ్చిన ప్యాట్ కమ్మిన్స్... కేకేఆర్ తరుపున 7 మ్యాచుల్లో 9 వికెట్లు తీసి, ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
undefined
అదీకాకుండా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచి, క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు.
undefined
కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న టీమిండియాకి సాయంగా 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన ప్యాట్ కమ్మిన్స్, సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఐపీఎల్ పార్ట్ 2కి మాత్రం అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు.
undefined
దీనికి కారణంఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది అతని ఫియాన్సీ బెక్కీ బాస్టన్.
undefined
ప్యాట్ కమ్మిన్స్ గర్ల్‌ఫ్రెండ్, ఫియాన్సీ బెక్కీ బాస్టన్... ఏప్పిల్ 23న సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసింది. ఇప్పుడామెకి ఐదో నెల.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడడం, ఆస్ట్రేలియా, భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో మాల్దీవుల్లో ఒంటరిగా గడిపిన ప్యాట్ కమ్మిన్స్‌... సిడ్నీలో క్వారంటైన్ పూర్తిచేసుకుని ఎట్టకేలకు ప్రియురాలిని కలిశాడు.
undefined
సెప్టెంబర్ నెల మధ్యలో ఐపీఎల్ 2021 సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. అయితే ఆ సమయానికి బెక్కీ ప్రసవ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట.
undefined
మొదట ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్యాట్ కమ్మిన్స్ రాకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం.
undefined
కేకేఆర్ కెప్టెన్, ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఉండడంతో ఆండ్రే రస్సెల్ రాకపై అనుమానాలు నెలకొన్నాయి.
undefined
ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమ్మిన్స్, ఆండ్రే రస్సెల్ లాంటి స్టార్లు రాకపోతే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు కూడా స్టార్లు లేని సదా సీదా జట్టుగా మారుతుంది.
undefined
click me!