వైరల్ : ఏమైనా తిన్నావా?.. మ్యాచ్ మధ్యలో అనుష్కను అడిగిన కోహ్లీ..

First Published Oct 27, 2020, 4:28 PM IST

ఐపీఎల్ 2020లో ఆదివారం జరిగిన 44వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో చివరికి చెన్నై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి మొదట బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి ఓడిపోయినప్పటికీ కోహ్లీ వార్తల్లో నిలిచాడు. 

ఐపీఎల్ 2020లో ఆదివారం జరిగిన 44వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో చివరికి చెన్నై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి మొదట బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి ఓడిపోయినప్పటికీ కోహ్లీ వార్తల్లో నిలిచాడు.
undefined
టగ్ ఆఫ్ వార్ గా జరుగుతున్న మ్యాచులో కూడా విరాట్ తన భార్య అనుష్క మీద చూపించిన కేర్ ఇప్పుడు వైరల్ గా మారింది. మ్యాచ్ మధ్యలో విరాట్ అనుష్కకు తిన్నావా అన్నట్టుగా సైగ చేయడం అభిమానులకు తెగ నచ్చేసింది.
undefined
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. కానీ ఈ మ్యాచ్ తరువాత, సోషల్ మీడియాలో విరాట్, అనుష్క మధ్య మైదానంలో జరిగిన హావభావాలు వీక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
undefined
విరాట్‌ను ఉత్సాహపరిచేందుకు అనుష్క స్టేడియానికి వచ్చింది. ఎరుపు రంగు దుస్తుల్లో అనుష్క మెరిసిపోయింది. ఆర్సీబీ చేసిన ప్రతీ పరుగుకు, తీసిన ప్రతీ వికెట్ కు అనుష్క జట్టును ఉత్సాహపరిచింది.
undefined
కోహ్లీ పోడియంలో ఉన్న అనుష్క ను చూస్తూ సైగ చేశాడు. దాన్ని కెమెరామెన్ ఎంతో చక్కగా రికార్డ్ చేశాడు. కడుపుతో ఉన్న అనుష్కను ఏమైనా తిన్నావా అన్నట్టుగా సైగ చేశాడు.
undefined
విరాట్ ప్రశ్నకు, అతని కేరింగ్ కి అనుష్క సంతోషంతో అనువు అని సమాధానం ఇచ్చింది. అంత టెన్షన్ వాతావరణంలోనూ కోహ్లీ, అనుష్క మీద చూపించిన కేర్ చాలా ముద్దుగా అనిపించింది.
undefined
ఈ అందమైన క్షణాలను సోషల్ మీడియా చక్కగా బంధించింది. భార్య మీద, పుట్టబోయే బిడ్డమీద కోహ్లీకి ఉన్న బాధ్యతకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇలాంటి కేరింగ్ తో విరాట్ అంతకుముందు కూడా తాను బాధ్యతాయుతమైన తండ్రినవుతానని చాలాసార్లు రుజువు చేశాడు.
undefined
ఇక చెన్నై మ్యాచ్ విషయానికి వస్తే ఫాఫ్ డు ప్లెసిస్, రితురాజ్ గైక్వాడ్ లు చక్కటి ఇన్నింగ్స్ తో జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్ పడే సమయానికి 46 పరుగుల భాగస్వామ్యంతో ఉన్నారు.
undefined
ఆదివారంనాటి మ్యాచ్‌లో కోహ్లీ 39వ అర్థ సెంచరీ చేసి ఐపీఎల్‌లో 39 అర్థ సెంచరీలు చేసిన శిఖర్ ధావన్ రికార్డుతో సమం అయ్యాడు.
undefined
దుబాయ్‌లో కొనసాగుతున్న ఐపిఎల్ 2020 లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి జెర్సీ రంగును మార్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ జెర్సీని ధరించింది.
undefined
click me!