టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహారిస్తుంటే, అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు హనుమ విహారి, ఛతేశ్వర్ పూజారాలతో పాటు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలకు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.
వీరితో పాటు కెఎల్ రాహుల్, వృద్ధమాన్ సాహా, యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లకు కూడా టెస్టు టీమ్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు.
బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నారు.
వన్డే జట్టు: వన్డే జట్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహారిస్తే, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహారిస్తాడు.
శిఖర్ ధావన్, శుబ‌్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజాలకు వన్డే జట్టులో అవకాశం దక్కింది.
బౌలింగ్ విభాగంలో చాహాల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సైనీ, శార్దూల్ ఠాకూర్‌లను వన్డేలకు ఎంపిక చేశారు సెలక్టర్లు.
టీ20 జట్టు: టీ20 సిరీస్‌కు కూడా విరాట్ కోహ్లీయే నాయకత్వం వహించాడు. కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహారిస్తాడు.
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్, రవీంద్ర జడేజాలకు టీ20 జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు.
టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ విభాగాన్ని వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చాహార్, వరుణ్ చక్రవర్తి మోయనున్నారు.
వీరితో పాటు కమ్లేశ్ నాగర్‌కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పొరెల్, నటరాజన్ కూడా అదనపు బౌలర్లుగా ఆసీస్ టూర్‌కి వెళ్లనున్నారు.
గాయం కారణంగా గత రెండు మ్యాచుల్లో ఆడని ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు.
గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయలేదా? లేక మరేదైనా కారణముందా అనేది తెలియరాలేదు.