పాండ్యా లాంటి ప్లేయర్ పాకిస్తాన్‌కి లేడు, వరల్డ్ కప్ గెలవాలంటే... షాహిదీ ఆఫ్రిదీ కామెంట్...

First Published Oct 2, 2022, 4:51 PM IST

బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో అంచనాలకు మించి రాణిస్తోంది పాకిస్తాన్ జట్టు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్, ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న పాక్ జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగుతోంది...

hardik pandya

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో బౌలర్‌గా, బ్యాటర్‌గా ఫెయిల్ అయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. బ్యాటుతోనే కాకుండా బాల్‌తోనూ మెరుపులు మెరిపిస్తూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు...

Image credit: Getty

‘హార్ధిక్ పాండ్యా లాంటి ఫినిషర్ అయితే పాకిస్తాన్‌ జట్టులో లేడు. అసిఫ్ ఆలీ, ఖుష్‌దిల్ ఇలా మారతారని, మ్యాచ్‌లను మలుపు తిప్పుతారని అనుకున్నాం. అయితే ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప వాళ్ల నుంచి మేం ఏం ఆశించామో ఆ పర్ఫామెన్స్ అయితే రాలేదు...

Hardik Pandya

నవాజ్ అప్పుడప్పుడు కొడతాడు, షాదబ్ ఖాన్ అయితే ఎప్పుడు ఆడతాడో అతనికే తెలీదు. పేరుకి పాకిస్తాన్ టీమ్‌లో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరైనా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది...

షాదబ్ ఖాన్ బౌలింగ్ పర్ఫామెన్స్ పాక్ టీమ్‌కి చాలా కీలకం. షాదబ్ ఖాన్ మంచి బౌలింగ్ పర్ఫామెన్స్ ఇస్తే, పాకిస్తాన్ ఈజీగా గెలుస్తుంది... ఇప్పుడు ఆడుతున్న పిచ్‌లకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఓ ఆల్‌రౌండర్ కచ్ఛితంగా కావాల్సిందే...

ఈ బౌలింగ్, బ్యాటింగ్ అటాక్‌తో కొన్ని మ్యాచులు గెలవాలంటే గెలవచ్చు కానీ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే మాత్రం అయ్యే పని కాదు. దానికి చాలా వర్క్ చేయాలి. తప్పులు తక్కువగా చేసిన జట్టు, ఎక్కువ విజయాలు అందుకుంటుందనే విషయం తెలుసుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ..

click me!